హోమ్ /వార్తలు /బిజినెస్ /

General Insurance: కరోనాతో మరణించిన సాధారణ బీమా ఉద్యోగులకు రు.10 లక్షల పరిహారం.. పూర్తి వివరాలివిగో

General Insurance: కరోనాతో మరణించిన సాధారణ బీమా ఉద్యోగులకు రు.10 లక్షల పరిహారం.. పూర్తి వివరాలివిగో

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కరోనా కారణంగా మరణించిన సాధారణ బీమా కంపెనీల(జీవిత బీమా కాని కంపెనీలు) ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ప్రభుత్వ అధీనంలో ఉన్న నాలుగు నాన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీల ఉద్యోగులకు ఈ ఎక్స్ గ్రేషియో వర్తిస్తుంది. కరోనా కారణంగా మరణిస్తే వీరి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందుతుంది.

ఇంకా చదవండి ...

కరోనా కారణంగా మరణించిన సాధారణ బీమా కంపెనీల(జీవిత బీమా కాని కంపెనీలు) ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ప్రభుత్వ అధీనంలో ఉన్న నాలుగు నాన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీల ఉద్యోగులకు ఈ ఎక్స్ గ్రేషియో వర్తిస్తుంది. కరోనా కారణంగా మరణిస్తే వీరి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందుతుంది. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం, సదరు బీమా సంస్థలే ఈ ఎక్స్ గ్రేషియోను చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ ఇన్సురెన్స్ ఎంప్లాయిస్ ఆల్ ఇండియా అసోసియేషన్ (GIEAIA) టాప్ లీడర్ ఒకరు పేర్కొన్నారు.

కోవిడ్-19 ఎక్స్ గ్రేషియో పేమేంట్..

- ప్రభుత్వ అధీనంలో ఉన్న దిఓరియంటల్ ఇన్సురెన్స్, దినేషనల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్, దిన్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే నాలుగు సాధారణ బీమా కంపెనీల ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియో వర్తిస్తుంది.

- నాలుగు బీమా సంస్థల్లో ఒకటైన ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెనీ.. కోవిడ్-19తో మరణించిన ఉద్యోగి నామినీకి రూ.10 లక్షల మొత్తాన్ని పరిహారంగా ఇస్తున్నట్లు గురువారం నాడు ప్రకటించింది.

- స్టాఫ్ గ్రూప్ మెడి క్లెయిమ్ విధానం ప్రకారం ఉద్యోగి/జీవిత భాగస్వామి/ ఆధార పడిన పిల్లలు, తల్లిదండ్రుల చికిత్స కోసం మిగిలిన ఖర్చుల్లో 100 శాతం తిరిగి చెల్లిస్తామని బీమా సంస్థ తెలిపింది.

-ఈ ప్రయోజనం కొన్ని నిర్ధిష్ట వ్యాధుల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ ఎక్స్ గ్రేషియోను మెడికల్ రిలీఫ్ స్కీమ్ నుంచి నేరుగా చెల్లిస్తారు.

- 2020లో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత కోవిడ్-19తో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ ప్రయోజనాలు అందుతాయి. భవిష్యత్తులోనూ ఈ మహమ్మారి బారిన పడిన వారికి ఇది వర్తిస్తుందని బీమా సంస్థ తెలిపింది.


- ప్రస్తుతం ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెనీ మాత్రమే ఈ అంశంపై ప్రకటనను జారీ చేయగా.. మిగిలిన ప్రభుత్వ బీమా సంస్థలైన నేషనల్ ఇన్సురెన్స్ కంపెనీ, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, ద యునైడెట్ ఇన్సురెన్స్ కంపెనీలు త్వరలో తమ సర్కూలర్ ను విడుదల చేయనున్నాయని GIEAIA ప్రధాన కార్యదర్శి కే గోవిందన్ తెలిపారు.

First published:

Tags: Business

ఉత్తమ కథలు