Income Tax Returns: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త.. రిటర్న్స్ దాఖలుకు గడువు పొడిగింపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రిటర్న్ దాఖలు చేసేందుకు గడువు పొడిగించంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసే గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంపెనీలకు సైతం రిటర్న్స్ దాఖలు చేసేందుకు నవంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది కేంద్రం. కరోనా విజృంభణ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) వెల్లడించింది. అయితే వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్న్స్ దాఖలుకు జులై 31వ తేదీ వరకు, కంపెనీలకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఉంది. తాజా పొడిగింపుతో వ్యక్తులు సెప్టెంబర్ 31 వరకు, కంపెనీలకు నవంబర్ 30 వరకు రిటర్న్స్ దాఖలుకు అవకాశం కలిగింది. ఇదిలా ఉంటే కంపెనీలు వారి ఉద్యోగులకు జారీ చేసే ఫామ్ 16 గడువును సైతం కేంద్రం పొడిగించింది. ఇందుకు జులై 15 వరకు గడువును నిర్ణయించారు.
    Covid-19 Situation in India: కేసులు తగ్గుతున్నాయి.. మరణాలు పెరుగుతున్నాయి!

    ఐటీ శాఖ ఆదాయ‌పు ప‌న్ను రిటర్న్స్ దాఖ‌లు చేయడాన్ని మరింత ఈజీ చేసేందుకు కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in కు బదులుగా నూతన పోర్టల్ www.incometaxgov.inను తీసుకు రానున్నారు. ఈ కొత్త పోర్టల్ జూన్ 7 నుంచి అందుబాటులోకి వస్తోంది. దీంతో.. జూన్ 1వ తేదీ నుంచి 6 వరకు పాత పోర్టల్ అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు.

    ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్​దారుల ఎదురుచూపులు ఫలించేలా కన్పిస్తున్నాయి. కరోనా విజృంభన కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు జూన్​ 1న ప్రకటించే అవకాశం ఉంది. 7వ వేతన సవరణ సంఘం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికను అందించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జెసిఎం) స్టాఫ్ సైడ్ ప్రకారం, వచ్చే నెల నుంచి డీఏ అమలు కానుందని తెలుస్తోంది. ఈసారి డిఎ పెంపు కనీసం 4 శాతం వరకు ఉంటుందని జెసిఎం అంచనా వేసింది.

    దీనిపై జేసీఎం ఉద్యోగుల విభాగం కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ ‘‘డీఏ పెంపు అంశంపై మేము ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డీఓపీటీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ ప్రభావం వల్ల ఏప్రిల్​ తొలి వారంలోనే ప్రకటించాల్సిన డీఏ పెంపుదలను తొలుత మే, ఆ తర్వాత జూన్​కు వాయిదా వేసినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే, ఈ సారి వాయిదా పడకపోవచ్చని వారు తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published: