GST Filing | టాక్స్ టైముకి చెల్లించలేకపోయిన వారికి కొద్దిగా ఉపశమనం కలిగినట్లే. GST ఫైలింగ్ గడువు తేదీని CBDT పెంచింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఫైలింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ 31లోపు చెల్లించవచ్చని తెలిపింది. అలాగే 2018-19 జీఎస్టీ ఫైలింగ్ గడువు తేదీని 2020 మార్చి 31 వరకూ పెంచింది. అంతేకాదు... GSTని ఫైల్ చేయడానికి వాడే రెండు ఫామ్స్‌లో కొన్ని అంశాల్ని ఆప్షన్‌గా మార్చింది. అందువల్ల అవి ఫిలప్ చెయ్యకపోయినా పర్వాలేదు. ఈ నిర్ణయం టాక్స్ చెల్లింపుదారులకు కలిసొచ్చేదే. ఇలా ఎందుకు చేసిందంటే... GST ఫైలింగ్‌లో ఇన్ని వివరాలు ఇవ్వలేక, ఇచ్చినా కొన్ని సరిగా సెట్ కాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందువల్ల అంతగా ముఖ్యం కాదు అనుకున్న అంశాల్ని ఆప్షన్స్‌గా మార్చేసింది CBDT. జీఎస్టీ చెల్లింపుల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రయోజనం కలిగేలా 2 జీఎస్టీ ఫారంలనూ ఈజీగా ఉండేలా చేసినట్లు CBDT తెలిపింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకూ పన్ను చెల్లింపుదారులు తమ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను జతపరచాల్సిన పనిలేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.6 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూలైంది. బడ్జెట్లో రూ.13.35 లక్షల కోట్లు రావాలని అనుకున్నారు. అంచనాలు తప్పినట్లైంది. ఆర్థిక మందగమనం వల్ల పన్ను వసూళ్ల లక్ష్యం చేరుకోవడం కష్టంగా కనిపిస్తోంది. వృద్ధిరేటు 5.5 శాతం కంటే తగ్గితే పన్ను వసూళ్లపై ఒత్తిడి తప్పదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
Pics : తెలుగు అందం శృతి రెడ్డి క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :
నేడు టీఆర్ఎస్, వైసీపీ సమావేశాలు... ఏం చర్చిస్తారంటే...
కొంపముంచిన లింక్... రూ.4 లక్షలు హాంఫట్
Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...
క్లౌడ్ బెర్రీస్ విశేషాలు తెలుసా... టేస్ట్ ఎలా ఉంటాయి?
Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు
Published by:Krishna Kumar N
First published:November 15, 2019, 06:44 IST