హోమ్ /వార్తలు /బిజినెస్ /

PAN Card: పాన్ కార్డు అమలు.. కేంద్రం కీలక నిర్ణయం!

PAN Card: పాన్ కార్డు అమలు.. కేంద్రం కీలక నిర్ణయం!

 PAN Card: పాన్ కార్డు అమలు.. కేంద్రం కీలక నిర్ణయం!

PAN Card: పాన్ కార్డు అమలు.. కేంద్రం కీలక నిర్ణయం!

Pan Number | మోదీ సర్కార్ పాన్ కార్డుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దేశంలో వ్యాపార నిర్వహణను సులభతం చేయడానికి పాన్ కార్డు నెంబర్‌ను ఉపయోగించు కోవాలని కేంద్రం భావిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Piyush Goyal | పాన్ కార్డుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ దగ్గరి నుంచి పన్ను చెల్లింపు వరకు పాన్ కార్డు (Pan Card) కచ్చితంగా కావాల్సిందే. తాజాగా మోదీ (Modi) సర్కార్ పాన్ కార్డు ద్వారా దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతం చేయాలని ప్రణాళికలు రచించింది. అందుకే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్ఎస్‌డబ్ల్యూఎస్ సమీక్ష సమావేశం తర్వాత ముఖ్య ప్రకటన చేశారు.

నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎస్ఎస్‌డబ్ల్యూఎస్) విధానం అనేది రెడ్ టేప్‌ను రెడ్ కార్పెట్‌గా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలను సాకారం చేయడంలో సహాయపడుతుందని పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల మధ్య డేటా ఏపీఐ ఇంటిగ్రేషన్ కోసం పాన్ నెంబర్‌ను ప్రత్యేక ఐడెంటిఫైయర్‌గా ఉపయోగించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దీని వల్ల సింగిల్ బిజినెస్ యూజర్ ఐడీ ఏర్పాటు చేయొచ్చని తెలిపారు.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడే వారికి షాక్! జనవరి 1 నుంచి కొత్త రూల్స్!

అలాగే ఎన్ఎస్‌డబ్ల్యూఎస్ ద్వారా డేటా డూప్లికేషన్ అనేది తగ్గుతుందని వివరించారు. ఆటో పాపులేషన్ మాడ్యూల్ ద్వారా ఒకే డేటాను వివిధ ఫామ్స్‌లో నింపొచ్చని తెలిపారు. 27 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 19 రాష్ట్రాలు ఎన్ఎస్‌డబ్ల్యూఎస్‌లో భాగమయ్యాయని పేర్కొన్నారు. వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, ఇథనాల్ పాలసీ, లెదర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, హాల్‌మార్కింగ్ ఆఫ్ జువెలరీ, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ వంటివి అన్ని ఇందులో ఉన్నాయని వివరించారు.

ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కొత్త సర్వీసులు తెచ్చిన బ్యాంక్, ఇకపై క్షణాల్లో..

అంతేకాకుండా నేషనల్ ల్యాండ్ బ్యాంక్‌ను కూడా ఎన్ఎస్‌డబ్ల్యూఎస్‌లో ఇంటిగ్రేట్ చేస్తామని ఆయన తెలిపారు. వివిధ ఇండస్ట్రియల్ పార్క్స్, ఎస్టేట్స్‌లలోని లక్ష హెక్టార్ల భూమి ఎన్ఎస్‌డబ్ల్యూఎస్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ కొనుగోలుకు ఈ పోర్టల్ సింగిల్ స్టాప్ షాప్‌గా ఉంటుందని వివరించారు. రాష్ట్రాల్లో ఎన్ఎస్‌డబ్ల్యూఎస్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఒక ప్రోత్సాహం అందిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మెరుగైన ర్యాంక్ అందిస్తోంది. ఇంకా లైసెన్స్ రెన్యూవల్ సర్వీసులను కూడా ఎన్ఎస్‌డబ్ల్యూఎస్ కిందకు తెస్తామని ఆయన పేర్కొన్నారు.

కాగా ఎన్ఎస్‌డబ్ల్యూఎస్ అనేది ఒక గేమ్‌ఛేంజర్‌ లాంటి కార్యక్రమం అని, దీని వల్ల దేశంలో పెట్టుబడులు పెరుగుతాయని ఆయన తెలిపారు. ఈ వ్యవస్థలో మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కలిసి సమిష్టిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్ఎస్‌డబ్ల్యూఎస్‌కి 76 వేల అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. ఇందులో దాదాపు 48 వేల వాటిని అనుమతులు జారీ చేశారని పేర్కొన్నారు.

First published:

Tags: PAN, PAN card, Piyush Goyal

ఉత్తమ కథలు