హోమ్ /వార్తలు /బిజినెస్ /

Money: కాసుల వర్షం కురిపిస్తున్న ప్రభుత్వ బ్యాంక్.. 10 రోజుల్లో రూ.లక్షకు రూ.2 లక్షలు!

Money: కాసుల వర్షం కురిపిస్తున్న ప్రభుత్వ బ్యాంక్.. 10 రోజుల్లో రూ.లక్షకు రూ.2 లక్షలు!

Money: కాసుల వర్షం కురిపిస్తున్న ప్రభుత్వ బ్యాంక్.. 10 రోజుల్లో డబ్బు రెట్టింపు!

Money: కాసుల వర్షం కురిపిస్తున్న ప్రభుత్వ బ్యాంక్.. 10 రోజుల్లో డబ్బు రెట్టింపు!

Punjab and Sind Bank | బ్యాంక్ షేర్లు కాసులు కురిపిస్తున్నాయి. భారీ లాభాలు అందిస్తున్నాయి. తాజాగా ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల డబ్బులను రెట్టింపు చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Banks | బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే వడ్డీ వస్తుంది. అయితే ఈ వడ్డీ రేటు అనేది తక్కువగానే ఉంటుంది. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారు బ్యాంక్‌లో (Bank) డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేస్తారు. అయితే రిస్క్ తీసుకునే వారు బ్యాంక్‌లో ఎఫ్‌డీ కాకుండా బ్యాంక్ షేర్లను కొంటే భారీ లాభాలు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో బ్యాంక్ షేర్ల హవా నడుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు కూడా పరుగులు పెడుతున్నాయి. చాలా షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి తాకాయి.

భారీ లాభాలు అందించిన స్టాక్స్‌లో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ షేర్లు కూడా ఉన్నాయి. నవంబర్ 14న ఈ బ్యాక్ షేరు ధర రూ. 18.4 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు ఈ బ్యాంక్ షేరు రూ. 37కు చేరింది. అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. అంతేకాకుండా ఈ రోజు మార్నింగ్ ఈ బ్యాంక్ షేరు 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. రూ. 40.85 స్థాయిని తాకింది. 10 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. అంటే ఈ కాలంలో దాదాపు 20 ట్రేడింగ్ సెషన్లలోనే షేరు ధర 122 శాతం ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు.

ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. బ్యాంక్ కీలక నిర్ణయం! ఈ రోజు నుంచి..

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ షేర్లు క్రమంగా పెరుగుతూనే వచ్చాయి. సోమవారం రోజున 52 వారాల గరిష్ట స్థాయి అయిన 37.15ని టచ్ చేశాయి. కేవలం నెల రోజుల్లోనే డబ్బులు రెట్టింపు అయ్యాయి. అంటే రూ.లక్ష పెట్టిన వారికి రూ. 2 లక్షలు వచ్చి ఉంటాయి. అంతేకాకుండా ఈ బ్యాంక్ షేర్లు 13 రోజుల్లోనే 99 శాతం ర్యాలీ చేశాయి. అంటే 13 రోజుల కిందట రూ. లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ. 99 వేల ప్రాఫిట్ వచ్చి ఉండేది. నవంబర్ 30న ఈ బ్యాంక్ షేరు రూ. 20 వద్ద ఉండేది. ఇప్పుడు రూ. 40 పైకి చేరింది. అంటే పది ట్రేడింగ్ సెషన్లలో షేరు రెట్టింపు అయ్యింది.

ఒకేసారి 13 బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ!

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ షేరు ధరను గమనిస్తే.. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే ఈ బ్యాంక్ షేరు 148 శాతం మేర ర్యాలీ చేసింది. గత ఆరు నెలల కాలంలో స్టాక్ ధర 185 శాతం మేర పరుగులు పెట్టింది. గత నెల రోజుల్లో గమనిస్తే.. 122 శాతం మేర షేరు పైకి కదిలింది. కాగా ఈ బ్యాంక్ షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 13గా ఉంది. బ్యాంక్ ఆర్థిక ఫలితాలు బాగుండటం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మెరుగైన పనితీరు కనబరచింది. దీంతో షేరు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది.

First published:

Tags: Banks, FD rates, Fixed deposits, Money, Stocks

ఉత్తమ కథలు