ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ మారింది... కొత్త రేట్లు ఇవే

జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో 1, 2, 3 ఏళ్ల ఫిక్స్‌ డిపాజిట్లపై 7 శాతం లభిస్తుంది. గతంలో ఇది ఒక ఏడాదికి 6.9 శాతం, మూడేళ్లకు 7.2 శాతం ఉండేది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి అకౌంట్, 5 ఏళ్ల మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌పై వడ్డీ రేట్‌లో ఎలాంటి మార్పు లేదు.

news18-telugu
Updated: January 4, 2019, 5:31 PM IST
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ మారింది... కొత్త రేట్లు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చింది కేంద్ర ప్రభుత్వం. కొత్త వడ్డీ రేట్లు 2019 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. పోస్ట్ ఆఫీసుల్లో ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ, మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు తక్కువ వడ్డీ రావడం విశేషం. కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో 1, 2, 3 ఏళ్ల ఫిక్స్‌ డిపాజిట్లపై 7 శాతం లభిస్తుంది. గతంలో ఇది ఒక ఏడాదికి 6.9 శాతం, మూడేళ్లకు 7.2 శాతం ఉండేది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి అకౌంట్, 5 ఏళ్ల మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌పై వడ్డీ రేట్‌లో ఎలాంటి మార్పు లేదు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ మారింది... కొత్త రేట్లు ఇవే | Govenment of india revised interest rates on deposits... Know new interest rates

ప్రతీ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. ఇంతకుముందు సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను సమీక్షించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి 0.4 శాతం వడ్డీని పెంచింది. పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి అకౌంట్, 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌పై చక్రవడ్డీని వార్షికంగా లెక్కిస్తారు. టర్మ్ డిపాజిట్లపై చక్రవడ్డీని మూడు నెలలకోసారి లెక్కిస్తారు.




ఇవి కూడా చదవండి:

షాక్... మీరు యాప్ వాడకున్నా ట్రాక్ చేస్తున్న ఫేస్‌బుక్

సిమ్ కార్డుతో మీ అకౌంట్ ఖాళీ... జాగ్రత్తలు తెలుసుకోండి
Loading...
2019లో వాట్సప్‌లో కొత్తగా వచ్చే ఫీచర్లు ఇవేనా?

వేతనజీవులు 2018-19లో ఎంత పన్ను ఆదా చేయొచ్చో తెలుసా?
First published: January 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...