HOME » NEWS » business » GOOGLE TO PAUSE POLITICAL ADVERTISEMENTS FROM JANUARY 14TH BA

Google: రాజకీయ పార్టీలకు గూగుల్ షాక్.. రేపటి నుంచి సరికొత్త రూల్

గూగుల్ కంపెనీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. రాజకీయ ప్రకటనలు నిలిపివేసింది. జనవరి 14 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

news18-telugu
Updated: January 13, 2021, 9:46 PM IST
Google: రాజకీయ పార్టీలకు గూగుల్ షాక్.. రేపటి నుంచి సరికొత్త రూల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గూగుల్ కంపెనీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. రాజకీయ ప్రకటనలు నిలిపివేసింది. జనవరి 14 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ నిషేధం జనవరి 21 వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ చేపట్టనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా గూగుల్ రాజకీయ ప్రకటనల విషయంలో పాక్షిక బ్యాన్ విధించింది. అయితే, ఎన్నికలు ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత మళ్లీ ప్రకటనలకు అనుమతి ఇచ్చింది. ఇటీవల అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్, గూగుల్ అనుబంధ అన్ని విభాగాల్లోనూ ఎలాంటి రాజకీయ ప్రకటనలను తీసుకోదు. ఇదో సున్నితమైన అంశం కాబట్టి, తాము ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నట్టు గూగుల్ తెలిపింది. ‘అమెరికా అధ్యక్షుడి అభిశంసన, ప్రమాణస్వీకారం, నిరసనలకు సంబంధించి ప్రకటనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం.’ అని గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ కూడా రాజకీయ ప్రకటనల మీద ఇప్పటికే నిషేధం విధించింది. గత నెలలో జార్జియాలో మాత్రం కొంచెం మినహాయింపులు ఇచ్చింది. విధ్వంసాలను, పరస్పర వ్యతిరేకతను ప్రోత్సహించే తరహా ప్రకటనలు తమ పాలసీకి విరుద్ధమని గూగుల్ కంపెనీ తెలిపింది.

టెక్ దిగ్గజం గూగుల్(Google) భారత్‌లో అపరిమిత క్లౌడ్ స్టోరేజ్ సేవలను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్లౌడ్ స్టోరేజ్ సేవలను గూగుల్ వన్(Google One) యాప్ ద్వారా అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్లో10 కోట్ల డౌన్లోడ్ ను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ సేవలను పొందాలంటే వినియోగదారుడు ఛార్జ్లను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 15 జీబీ స్టోరేజ్ వరకు వినియోగదారుడు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 15జీబీ స్టోరేజి పరిమితిని మించి ఉంటే మాత్రమే గూగుల్ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సభ్యత్వం ద్వారా ఫోటోలు, Gmail, డ్రైవ్, మరిన్ని ఫైళ్ళను స్టోరేజ్ చేసుకోవచ్చు. కాగా, అమెరికాలో 10TB, 20TB, 30TB వంటి గరిష్ట గూగుల్ వన్ స్టోరేజ్ ప్లాన్‌లపై 50 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 13, 2021, 9:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading