• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • GOOGLE PAY TO OFFER INSTANT CREDIT TO SMALL AND MEDIUM ENTERPRISES SMES SOON SAYS REPORT SS

Google Pay: అప్పులు ఇవ్వనున్న గూగుల్ పే... ఎవరికంటే

Google Pay: అప్పులు ఇవ్వనున్న గూగుల్ పే... ఎవరికంటే

Google Pay: అప్పులు ఇవ్వనున్న గూగుల్ పే... ఎవరికంటే (ప్రతీకాత్మక చిత్రం)

Google Pay | చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు త్వరలో రుణాలు ఇచ్చే సేవల్ని ప్రారంభించనుంది గూగుల్ పే.

 • Share this:
  భారతదేశంలో పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ లాంటి సేవల్ని అందిస్తున్న గూగుల్ పే క్రెడిట్ బిజినెస్‌లో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అప్పులు ఇచ్చే ఆలోచనలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇందుకోసం భారతదేశంలోని టాప్ లెండర్స్‌తో గూగుల్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 30 లక్షల మందికి ఇన్‌స్టంట్ క్రెడిట్ అంటే తక్షణమే అప్పు ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించనుంది. అంటే ప్రీ-అప్రూవ్డ్ పద్ధతిలో ఇది పనిచేస్తుంది. ఇప్పటికే కన్స్యూమర్ లోన్స్ ఇచ్చేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్. మరి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇవ్వాలనుకునే రుణాల కోసం ఏఏ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంటుందో తెలియాల్సి ఉంది.

  Railway: ఆగస్ట్ 12 వరకు రైళ్ల రద్దు... రీఫండ్ రూల్స్ ఇవే

  ATM Rules: జూలై 1 నుంచి ఏటీఎం విత్‌డ్రా రూల్స్ మారే ఛాన్స్

  మేము వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. గూగుల్ పేలో రుణాలు తీసుకోవచ్చు. ఈ రుణాలను ఆర్థిక సంస్థలు అందిస్తాయి. దరఖాస్తు ప్రక్రియపై వ్యాపారులకు పూర్తి నియంత్రణ ఉండేలా చూస్తాం.
  అంబరీష్, సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, గూగుల్ పే


  ఇటీవల గూగుల్ పే Nearby ఫీచర్‌ను రిలీజ్ చేసింది. చిరు వ్యాపారులు డిజిటల్ వ్యవస్థలోకి వచ్చేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
  First published: