టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది కొత్త కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ వచ్చిన కొత్తలో స్మార్ట్‌ఫోన్ నుంచి పేమెంట్స్ చేసే విధానం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ (Banking Transactions) సులువుగా జరుపుతున్నారు. లక్షల రూపాయల్ని క్షణాల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ సేవలన్నీ వాడుకోవాలంటే స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాలి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు (UPI Transactions) జరపొచ్చు. యూజర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి సులువుగా లావాదేవీలు జరపొచ్చు.
ఆఫ్‌లైన్‌లో యూపీఐ లావాదేవీలు ఉపయోగించుకోవడానికి యూజర్లు *99# డయల్ చేయాల్సి ఉంటుంది. USSD 2.0 పద్ధతి ద్వారా ఈ సర్వీస్ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లతో పాటు నాన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు *99# సర్వీస్‌ను 2012 లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది. ఇప్పుడు యూపీఐ లావాదేవీలకు ఇదే నెంబర్‌ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. మరి ఇంటర్నెట్ లేకపోయినా డబ్బులు పంపడానికి ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.
SBI Card: ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్ ఫ్రీ
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో భీమ్ యూపీఐ యాప్ డౌన్లోడ్ చేయాలి.
Step 2- మీ వివరాలతో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
Step 3- ఆ తర్వాత మీ ఫోన్ డయల్ ప్యాడ్‌లో *99# టైప్ చేసి డయల్ చేయాలి.
Step 4- మీకు ఏడు ఆప్షన్స్ Send Money, Receive Money, Check Balance, My Profile, Pending Requests, Transactions, UPI PIN కనిపిస్తాయి.
Step 5- డబ్బులు పంపాలంటే డయల్ ప్యాడ్‌లో 1 ప్రెస్ చేసి Send Money ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 6- మీరు ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
Step 7- ఈ పేమెంట్స్ మెథడ్‌లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 8- ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీరు ఎవరికి డబ్బులు పంపాలో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 9- యూపీఐ ఐడీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అవతలివారి యూపీఐ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 10- బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 11 అంకెల ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 11- ఆ తర్వాత మీరు ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి.
Step 12- ఆ తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.
Step 13- చివరగా send పైన క్లిక్ చేస్తే మీ అకౌంట్ నుంచి అవతలి వారి అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి.
Step 14- మీకు ట్రాన్సాక్షన్ స్టేటస్ వివరాలు అప్డేట్ అవుతాయి. రిఫరెన్స్ నెంబర్ కూడా ఉంటుంది.
Credit Card: క్రెడిట్ కార్డు బిల్ కట్టలేకపోతున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి
యూజర్లు గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా కూడా ఇదే పద్ధతిలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా, మారుమూల ప్రాంతాల్లో ఉన్నా పైన చెప్పిన స్టెప్స్ ఫాలో అయి యూపీఐ ద్వారా డబ్బులు పంపడానికి వీలవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BHIM UPI, Google pay, Paytm, PhonePe, UPI