HOME »NEWS »BUSINESS »google maps live train running status google maps to now get live updates for bus train auto rickshaw rides mk

Google Maps live train running status : గూగుల్ మ్యాప్స్‌లో ఇకపై రైళ్ల లైవ్ స్టేటస్...మూడు సరికొత్త ఫీచర్స్‌తో మరింత సౌకర్యం..

Google Maps live train running status : గూగుల్ మ్యాప్స్‌లో ఇకపై రైళ్ల లైవ్ స్టేటస్...మూడు సరికొత్త ఫీచర్స్‌తో మరింత సౌకర్యం..
గూగుల్ మ్యాప్స్‌లో ఇకపై రైళ్ల లైవ్ స్టేటస్...మూడు సరికొత్త ఫీచర్స్‌తో మరింత సౌకర్యం..

Google Maps live train running status : బస్సు, ఆటో లైవ్ స్టేటస్ ను కూడా కొత్త ఫీచర్లలో జత చేశారు. తద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు సంబంధించిన సేవల్లోలకి గూగుల్ మ్యాప్స్ పూర్తి స్థాయిలో ప్రవేశించినట్లయ్యింది. ముఖ్యంగా ఈ ఫీచర్ ద్వారా ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పునే, లక్నో, హైదరాబాద్, చెన్నై, మైసూర్, కోయంబత్తూరు, సూరత్ వంటి నగరాల్లో గమ్యస్థానం చేరుకునేందుకు కచ్చితంగా ఎంత సమయం పడుతుందో ఈ ఫీచర్ల ద్వారా సదుపాయం కలిగింది.

  • Share this:
    గూగుల్ మ్యాప్స్ నుంచి సరికొత్త మూడు అప్ డేట్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన లేటెస్ట్ అప్ డేట్స్ లో గూగుల్ మ్యాప్స్ లో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టగా, ఇందులో ప్రధానంగా రైల్వే లైవ్ స్టేటస్ అనే ఫీచర్ ఉండటం విశేషం. దీంతో పాటు బస్సు, ఆటో లైవ్ స్టేటస్ ను కూడా కొత్త ఫీచర్లలో జత చేశారు. తద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు సంబంధించిన సేవల్లోలకి గూగుల్ మ్యాప్స్ పూర్తి స్థాయిలో ప్రవేశించినట్లయ్యింది. ముఖ్యంగా ఈ ఫీచర్ ద్వారా ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పునే, లక్నో, హైదరాబాద్, చెన్నై, మైసూర్, కోయంబత్తూరు, సూరత్ వంటి నగరాల్లో గమ్యస్థానం చేరుకునేందుకు కచ్చితంగా ఎంత సమయం పడుతుందో ఈ ఫీచర్ల ద్వారా సదుపాయం కలిగింది. అలాగే వివిధ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసుల్లో ఈ గూగుల్ మ్యాప్స్ ద్వారా సమయాభావం లేకుండా ప్రయాణించే వీలుంది. అలాగే రైళ్ల రాకపోకలు, ఎంత సమయం ఆలస్యమవుతుంది. ఏ ప్లాట్ ఫామ్ మీదకు రైలు వస్తుంది, తరువాతి స్టేషన్ ఏంటి అనే ఫీచర్లను సైతం ఈ గూగుల్ కొత్త ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్ వీ10.17.2 బీటా వెర్షన్ ద్వారా తెలుసుకునే వీలుంది.
    First published:June 04, 2019, 20:19 IST