May Day : ధర్నాకు దిగుతున్న గూగుల్ వాకౌట్ ఉద్యోగులు...

May Day Google Employees Sit in : ప్రపంచంలోనే టాప్ 5 బెస్ట్ కంపెనీల్లో ఒకటైన గూగుల్‌లో ఉద్యోగులు ధర్నాకు దిగుతామనడం ఆ కంపెనీకి షాకింగ్ విషయమే.

Krishna Kumar N | news18-telugu
Updated: May 1, 2019, 7:46 AM IST
May Day : ధర్నాకు దిగుతున్న గూగుల్ వాకౌట్ ఉద్యోగులు...
ప్రతికాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 1, 2019, 7:46 AM IST
May Day Google Employees Sit in : మే 1న మే డే సందర్భంగా... ఉదయం 11 గంటలకు ధర్నా చేస్తామని ప్రకటించారు గూగుల్ ఉద్యోగులు. గతేడాది గూగుల్ చాలా మందిని సిక్ లీవ్ కింద బయటకు పంపేసింది. ఉద్యోగుల ప్రాజెక్ట్ రిపోర్టులను వారికి ఇవ్వలేదు. 20,000 వేల మందికి పైగా ఉద్యోగులను 2018 నవంబర్‌లో వాకౌట్ చేసింది. వాళ్లలో చాలా మందిపై లైంగిక ఆరోపణలున్నాయి. దీనిపై ఉద్యోగుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ కంపెనీలో ఈ సమస్య కొనసాగుతోంది. నిజానికి గూగుల్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఉద్యోగులకు నచ్చట్లేదు. దీనిపై వాళ్లు బహిరంగంగానే తమ నిరసన తెలుపుతున్నారు. ఇటీవల గూగుల్ పెంటగాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టం ప్రాజెక్ట్ మావెన్ పై భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ ఈ ప్రాజెక్టు కంపెనీ రూల్స్‌కి విరుద్ధమంటూ ఉద్యోగులు వ్యతిరేకించారు. ప్రపంచమంతా తెలిసేలా తమ ధర్నా ఉంటుందన్నారు వాకౌట్ ఉద్యోగులు.




గూగుల్ మాత్రం ఉద్యోగుల ధర్నాను వ్యతిరేకించింది. వర్క్ ప్లేస్‌లో ధర్నాలు చెయ్యడం కంపెనీ రూల్స్‌కి విరుద్ధమని తెలిపింది. అలాగే... కంపెనీకి సంబంధించిన అంతర్గత విషయాల్ని ప్రజలకు తెలియజేయడం కూడా కరెక్టు కాదని ఓ గూగుల్ ప్రతినిధి అన్నారు. ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయన్న ఆయన... ఇలా ధర్నాలు చెయ్యడం వల్ల ఫలితం ఉండదన్నారు.
Loading...
 

ఇవి కూడా చదవండి :

అజంఖాన్‌పై రెండోసారి ఈసీ వేటు... 48 గంటల పాటూ ప్రచారం నిషేధం...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు... ఏర్పాటు దిశగా జోరందుకున్న ప్రయత్నాలు...

ఉత్తరాంధ్ర, ఒడిశావైపు దూసుకొస్తున్న ఫణి తుఫాను... 10,00,00,000 మందిపై ప్రభావం...

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి ఏపీలో మళ్లీ బ్రేక్... నిషేధం ఉందన్న ఈసీ... విడుదల అవుతుందన్న రాంగోపాల్ వర్మ
First published: May 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...