• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOOGLE CEO SUNDAR PICHAI DISAPPOINTED WITH DONALD TRUMP H1B VISA BAN MK

H1B Visa రద్దు బాధాకరం...అమెరికా అభివృద్ధి మొత్తం వలసదారుల పుణ్యమే...సుందర్ పిచాయ్ ఆవేదన..

H1B Visa రద్దు బాధాకరం...అమెరికా అభివృద్ధి మొత్తం వలసదారుల పుణ్యమే...సుందర్ పిచాయ్ ఆవేదన..

ప్రతీకాత్మకచిత్రం

Google CEO Sundar Pichai | అమెరికా యొక్క ఆర్ధిక విజయానికి ఇమ్మిగ్రేషన్ ఎంతో దోహదపడింది, ఆ కారణంగానే గ్లోబల్ లీడర్‌గా నిలిచింది, నేటి ప్రకటనతో నిరాశ చెందాను - మేము వలసదారులతో నిలబడి అందరికీ అవకాశాన్ని విస్తరించడానికి కృషి చేస్తాము" అని పిచాయ్ ట్వీట్ చేసారు.

  • Share this:
    H1B వర్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పట్ల నిరాశ చెందానని గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. గూగుల్ వలసదారులతో కలిసి కొనసాగుతుందని, అందరికీ అవకాశాలను విస్తరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు."అమెరికా యొక్క ఆర్ధిక విజయానికి ఇమ్మిగ్రేషన్ ఎంతో దోహదపడింది, ఆ కారణంగానే గ్లోబల్ లీడర్‌గా నిలిచింది, నేటి ప్రకటనతో నిరాశ చెందాను - మేము వలసదారులతో నిలబడి అందరికీ అవకాశాన్ని విస్తరించడానికి కృషి చేస్తాము" అని పిచాయ్ ట్వీట్ చేసారు. 2020 చివరి వరకు హెచ్ -1 బి, హెచ్ -2 బి, ఎల్, జె వంటి వర్గాలలో వర్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన ట్వీట్ చేశారు. "హెచ్ -1 బి, హెచ్ -2 బి రద్దు ద్వారా COVID-19 వ్యాప్తి వలన కలిగిన అసాధారణమైన నిరుద్యోగ పరిస్థితికి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని వైట్ హౌస్ పేర్కొంది. ఈ వీసాలపై ఇప్పటికే యుఎస్‌లో ఉన్నవారికి సస్పెన్షన్ వర్తించదు.

    హెచ్ -1 బి వీసా అనేది అమెరికాకు చెందిన భారతీయ టెక్కీలు ఎక్కువగా ఉపయోగించే ఉపాధి వీసాలలో ఒకటి. ఈ వీసాల్లో ఎక్కువ భాగం గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ మేజర్లతో పాటు భారతీయ ఐటి కంపెనీలైన టిసిఎస్, ఇన్ఫోసిస్ మరియు విప్రోలు భారతదేశం నుండి అమెరికాలో ఇంజనీర్లను మోహరించడానికి ఉపయోగిస్తున్నాయి.

    ఈ సస్పెన్షన్ వల్ల ప్రస్తుతం యుఎస్‌లో COVID-19 మహమ్మారి తర్వాత భారత్ కు తిరిగి వచ్చిన H-1B హోల్డర్‌లపై ప్రభావం చూపుతుంది. ఇది సెప్టెంబరు దాటిన కొనసాగితే, కొత్త వీసా ఆమోదాలను ప్రభావితం చేస్తుంది, ఇది సాధారణంగా అక్టోబర్‌లో జరుగుతుంది.
    First published: