Home /News /business /

GOOGLE ANNOUNCES A NEW FEATURE THAT WILL ALLOW USERS TO BUY TRAIN TICKETS IN SEARCH IN SELECTED COUNTRIES GH SRD

Train Tickets: గూగుల్ సెర్చ్ పేజీ నుంచే ట్రైన్ టికెట్ల బుకింగ్.. నయా ఫీచర్ అదుర్స్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Train Tickets: గూగుల్ కంపెనీ ఇప్పుడు సెర్చ్‌ పేజీలోనే రైలు టికెట్లను బుక్ చేయడానికి వీలుగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అలానే పర్యావరణహితమైన ప్రయాణాలు సాగించే విమాన ప్రయాణికుల కోసం సస్టైనబిలిటీ అనే ట్రావెల్ ఆప్షన్ తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
సెర్చ్ దిగ్గజం గూగుల్ (Google) తన యూజర్లకు అద్భుతమైన ఫీచర్ల (New Features)ను నిత్యం పరిచయం చేస్తూనే ఉంది. సెర్చ్‌ పేజీలలోనే కావలసిన సమాచారమంతా తెలిపేందుకు గూగుల్ కృషి చేస్తోంది. ముఖ్యంగా ట్రావెలర్స్‌ (Travellers)కు సెకన్ల వ్యవధిలో జర్నీ వివరాలను అందించేందుకు గూగుల్ సరికొత్త సెర్చ్ టూల్స్ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా తాజాగా తన సెర్చ్‌ పేజీలోనే రైలు టికెట్ల(Train Tickets)ను బుక్ చేయడానికి వీలుగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అలానే పర్యావరణహితమైన ప్రయాణాలు సాగించే విమాన ప్రయాణికుల కోసం సస్టైనబిలిటీ (Sustainability) అనే ట్రావెల్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇప్పుడు సెర్చ్ పేజీలోనే స్వదేశంలోని ట్రైన్స్‌తో పాటు విదేశాల్లోని ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం సాధ్యమవుతుందని గూగుల్ తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఈ సదుపాయం సెలెక్టెడ్ కంట్రీస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర దేశాల్లోనూ ట్రైన్ సర్వీసుల ప్రొవైడర్లతో కలిసి ఈ ఫీచర్‌ను మరిన్ని స్థానాలకు విస్తరించాలని గూగుల్ ముందడుగులు వేస్తోంది. * ముందు ఆ దేశాల్లోనే.. ప్రస్తుతం గూగుల్ జర్మనీ, స్పెయిన్, ఇటలీ, జపాన్‌ దేశాల్లో ఈ సరికొత్త సెర్చ్ టూల్స్ తీసుకొచ్చింది. వీటి సహాయంతో ఈ నాలుగు దేశాల్లో నివసించే ప్రజలు రైలు టికెట్లను బుకింగ్ చేయడం కోసం నేరుగా గూగుల్ సెర్చ్ ఉపయోగించవచ్చు. స్వదేశంతో పాటు తమ చుట్టుపక్కల ఉన్న దేశాలలోని ట్రైన్‌లో టికెట్లను గూగుల్ సెర్చ్ పేజీలోనే షాపింగ్ చేయవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు గూగుల్ ట్రైన్ పేరు, టికెట్ ప్రైస్, షెడ్యూల్ టైమ్‌ వంటి వివరాలన్నీ తన సెర్చ్ పేజీలోనే అందిస్తుంది. దీనివల్ల ఆయా వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి చాలా సమయం వృథా చేయాల్సిన అవసరం రాదు. * ఎలా పనిచేస్తుంది? ఒకవేళ మీరు బెర్లిన్ నుంచి వియన్నాకి ట్రైన్‌లో వెళ్లాలనుకుంటే “Berlin to Vienna trains” అని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేసి ఎంటర్ చేయాలి. అంతే, సెర్చ్‌ రిజల్ట్స్‌లో మీకు ఒక డీటెయిల్డ్‌ లిస్ట్‌ కనిపిస్తుంది. ఆ లిస్ట్‌లో ఏ టైమ్‌కి ట్రైన్స్ ఉన్నాయి, ఆయా ట్రైన్లలో ప్రయాణించడానికి ఎంత డబ్బుతో టికెట్ కొనాలి? ఏ టికెట్ ప్రైస్ తక్కువగా ఉంది? ట్రైన్ జర్నీ ఎలా సాగుతుంది? ఏ ట్రైన్ ఫాస్ట్‌గా వెళ్తుంది? వంటి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ లిస్ట్‌లోనే నచ్చిన ట్రైన్ పేరుపై క్లిక్ చేసి "Buy ticket on.." ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని చాలా ఫాస్ట్‌గా, ఈజీగా టికెట్ కొనుగోలు/బుక్ చేసుకోవచ్చు. ఇది కూాడా చదవండి : ఐసీఐసీఐ బ్యాంక్ దుమ్మురేపే ఆఫర్లు.. రూ.25 వేల భారీ తగ్గింపు! మార్నింగ్ టైమ్‌లో లేదా ఇతర సమయాల్లోనూ ఏయే ట్రైన్స్‌ ఉన్నాయనేది 'Anytime' ఆప్షన్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే క్యాలెండర్ ఐకాన్‌పై నొక్కి ఏయే డేట్స్‌లో ఏయే ట్రైన్స్ ఉంటాయనేది కూడా వివరంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల బయలుదేరే సమయానికి అందుబాటులో ఉన్న ట్రైన్ల గురించి తెలుస్తుంది. * మరిన్ని ఫీచర్లు.. ఇంటర్‌సిటీ ప్రయాణం కోసం అనేక జర్నీ ఆప్షన్స్ అందించేందుకు భవిష్యత్తులో బస్సు టికెట్ల కోసం కూడా ఇలాంటి ఫీచర్‌ను గూగుల్ తీసుకురావచ్చు. అంతేకాకుండా, విమానాలు, హోటళ్ల కోసం కొత్త ఫిల్టర్లతో గూగుల్ మరిన్ని టూల్స్ తీసుకొచ్చి యూజర్లకు ఎంతగానో హెల్ప్ చేయనుంది. గూగుల్ విమాన ప్రయాణికుల కోసం కొత్త ఎమిషన్స్ ఫిల్టర్‌ (Emissions Filter)ను కూడా జోడించింది. "ఎనీ" లేదా "లో ఎమిషన్స్ ఓన్లీ" విమానాల్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Google, Google search, Train tickets

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు