గత కొద్దిరోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol, diesel rates) ఆకాశన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటి రూ.120కి చేరువగా వెళుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రలో ధర రూ. 113.46గా ఉంది. అయితే బుధవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. అక్కడక్కడ కొద్దిమేర మాత్రం పెరిగాయి. బుధవారం హైదరాబాద్లో పెట్రోల్ (petrol) ధర లీటర్కి రూ.111.91 గా ఉంది. మంగళవారం కూడా ఇదే ధర ఉంది. ఇక డీజిల్ (diesel) ధర రూ.105.08 గా ఉంది. ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.15 పైసలు తగ్గి రూ.111.45గా ఉంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు తగ్గి రూ.104.64 గా ఉంది. వరంగల్ (Warangal)లో గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి.
ఇక ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు..
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 107.59, ముంబై రూ. 113.46, చెన్నై రూ. 104.60, గుర్గావ్ రూ. 104.74, నోయిడా రూ. 104.76, బెంగళూరు రూ. 111.34 భువనేశ్వర్ రూ. 108.55 చండీగఢ్ రూ. 103.55, పాట్నా రూ. 111.24 గా ఉంది. త్రివేండ్రం రూ. 109.84 గా ఉంది.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..
కరీంనగర్ (Karimnagar)లో పెట్రోల్ ధర రూ.113.69 గా ఉంది. డీజిల్ ధర రూ.105.39కు చేరింది. నిజామాబాద్లో పెట్రోల్ ధర రూ.113.69 గా ఉంది. డీజిల్ ధర రూ.106.73 గా ఉంది.
ఎందుకు పెరుగుతున్నాయి..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 27, 2021 నాటి ధరల ప్రకారం 85.65 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో..
విశాఖపట్నంలో పెట్రోల్ (petrol) ధర ప్రస్తుతం రూ.112.66 గా ఉంది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.105.27 గా ఉంది. విజయవాడలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.114.48 గా ఉంది. డీజిల్ ధర రూ.107.00కు చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.