సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ నుంచి గుడ్‌ న్యూస్

పండుగ సెలవుల్లో కుటుంబమంతా కలిసి దూరప్రాంతాలకు ప్రయాణించేవాళ్లు రైలు టికెట్ బుక్ చేసుకోవడం ఓ సమస్యగా ఉండేది. నెలకు 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవాలన్న నిబంధనతో ఎక్కువ టికెట్లు తీసుకోవడం సాధ్యంకాకపోయేది. ఇతరుల ఐడీతోనో, రైల్వే కౌంటర్‌లోనే రిజర్వేషన్ చేయించుకోవాల్సి వచ్చేది.

news18-telugu
Updated: January 8, 2019, 4:08 PM IST
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ నుంచి గుడ్‌ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 8, 2019, 4:08 PM IST
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? కుటుంబమంతా కలిసి ప్రయాణానికి సిద్ధమవుతున్నారా? ఇంకా టికెట్ రిజర్వేషన్ చేయించుకోలేదా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ రైల్వే... అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఒక యూజర్ ఐడీ నుంచి ఐఆర్‌సీటీసీలో నెలకు 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడా నిబంధనలు మారాయి. ఒక యూజర్ ఐడీ నుంచి నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ తప్పు చేయకండి

పండుగ సెలవుల్లో కుటుంబమంతా కలిసి దూరప్రాంతాలకు ప్రయాణించేవాళ్లు రైలు టికెట్ బుక్ చేసుకోవడం ఓ సమస్యగా ఉండేది. నెలకు 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవాలన్న నిబంధనతో ఎక్కువ టికెట్లు తీసుకోవడం సాధ్యంకాకపోయేది. ఇతరుల ఐడీతోనో, రైల్వే కౌంటర్‌లోనే రిజర్వేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా సమస్య లేదు. ఏకంగా 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్ నెంబర్ వెరిఫై చేసినవాళ్లే 12 టికెట్లు బుక్ చేసుకునే అవకాశముంది. కొత్త రూల్ ప్రకారం ప్రయాణికులు ప్రయాణానికి 120 రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఒక యూజర్ ఐడీపై 2 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు.

ఇది కూడా చదవండి: రైల్ టికెట్ బుక్ చేస్తున్నారా... UTS యాప్ గురించి తెలుసా?మీరు మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే సులువుగా చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లాగిన్ చేసిన తర్వాత 'మై ప్రొఫైల్'లో ఆధార్ కేవైసీ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నెంబర్‌కు లింక్ చేసి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. మీ ఆధార్ నెంబర్ మాత్రమే కాకుండా మీతో ప్రయాణించేవారి ఆధార్ నెంబర్ కూడా టికెట్ బుక్ చేసే సమయంలో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక ఐడీపై మీరు 12 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:
Loading...
Budget 2019: బడ్జెట్‌లో ఉపయోగించే ఈ పదాలకు అర్థాలు తెలుసా?

Budget 2019: ఈసారి ట్యాక్స్ శ్లాబ్ మారుతుందా? వివరాలు తెలుసుకోండి...
First published: January 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...