కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? ఎక్కడైనా అప్పు చేద్దామనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ఒకప్పుడు పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 14 శాతం నుంచి 20 శాతం వరకు ఉండేవి. కానీ వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉండేవో ఇప్పుడు పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అలాగే ఉన్నాయి. 9.60 శాతం వడ్డీకే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. వేర్వేరు బ్యాంకుల్ని, కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌ను బట్టి వడ్డీరేట్లు మారుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, సెంట్రల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులతో సహా పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తున్నాయి. మరి ఏఏ బ్యాంకులో ఎంత శాతం వడ్డీకే పర్సనల్ లోన్ తీసుకోవచ్చో తెలుసుకోండి.
New Rules: ఆగస్ట్ 1 నుంచి మారే కొత్త రూల్స్ ఇవే
July 31 Deadline: ఈ 5 పనులకు జూలై 31 చివరి తేదీ... గుర్తున్నాయా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 9.60% నుంచి
యూకో బ్యాంక్- 9.80% నుంచి
సెంట్రల్ బ్యాంక్- 9.85% నుంచి
సిటీ బ్యాంక్- 9.99% నుంచి
బ్యాంక్ ఆఫ్ బరోడా- 10.10% నుంచి
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 10.65% నుంచి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 10.75% నుంచి
కొటక్ మహీంద్రా బ్యాంక్- 10.75% నుంచి
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 10.85% నుంచి
యూనియన్ బ్యాంక్- 10.90% నుంచి
మీ క్రెడిట్ స్కోర్ 750 నుంచి 900 మధ్య ఉంటే తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అయితే బ్యాంకులు మీకు రుణాలు ఇచ్చే ముందు క్రెడిట్ స్కోర్‌తో పాటు మీ ఉద్యోగ భద్రత, మీరు రుణాలు తీర్చగల కెపాసిటీ లాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటాయి. బ్యాంకులు అలాంటి కస్టమర్లను గుర్తించి ప్రీ-అప్రూవ్డ్ లోన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి.