GOOD NEWS TWO WHEELERS PRICES TO COME DOWN HERE IS WHY
Good News: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే కొన్ని రోజులు ఆగండి
ప్రతీకాత్మక చిత్రం
ద్విచక్ర వాహన ప్రియులకు త్వరలోనే కేంద్రం తీపికబురు చెప్పనుంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను కేంద్రం త్వరలోనే సవరించే అవకాశముంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా సంకేతాలిచ్చారు.
ద్విచక్ర వాహన ప్రియులకు త్వరలోనే కేంద్రం తీపికబురు చెప్పనుంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను కేంద్రం త్వరలోనే సవరించే అవకాశముంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా సంకేతాలిచ్చారు. జీఎస్టీ రేట్లను తగ్గిస్తే ఆ మేరకు 150 సీసీ వరకు ఉన్న ద్విచక్ర వాహనాల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై 28 శాతం జీఎస్టీ ఉంది. అయితే ద్విచక్ర విక్రయాలను ప్రోత్సహించేలా జీఎస్టీని తగ్గించాలని టూ వీలర్ ఆటోమొబైల్ రంగ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. 150 సీసీ వరకు ఉన్న బైక్‌లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఆ కంపెనీలు కేంద్రాన్ని కోరుతున్నాయి. మొదటి విడతలో ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గించిన తర్వాత ఆటోమొబైల్ రంగంలోని కార్లు, ఇతర విభాగాల్లోనూ జీఎస్టీని తగ్గించాలన్న కోరుతున్నారు. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తే ఇటు ఆటోమొబైల్ రంగానికి...అటు కొనుగోలుదారులకు ప్రయోజనం జరుగుతుందని చెబుతున్నారు.
నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి (ఫైల్ ఫోటో)
ఈ నేపథ్యంలో సీఐఐలో సభ్యులైన పరిశ్రమ వర్గాలతో జరిగిన చర్చల్లో నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన వస్తువులు కావు...హానికరమైన వస్తువులూ కావు...అందుకే జీఎస్టీ రేట్ల సవరింపునకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాపై రేట్ల సవరణ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
జీఎస్టీ కౌన్సిల్ గురువారం సమావేశంకానుంది. అయితే ఈ సమావేశంలో రాష్ట్రాలకు పరిహారం అంశంపై మాత్రమే చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవచ్చని పారిశ్రామికవర్గాల సమాచారం.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.