హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.40 లక్షల ఇన్స్యూరెన్స్ తీసుకోండి ఇలా

SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.40 లక్షల ఇన్స్యూరెన్స్ తీసుకోండి ఇలా

SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.40 లక్షల ఇన్స్యూరెన్స్ తీసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.40 లక్షల ఇన్స్యూరెన్స్ తీసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Life Sampoorn Suraksha Term Insurance | మీరు టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారా? మీరు ఎస్‌బీఐ కస్టమర్ అయితే యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్‌లో ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ సురక్ష టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు.

  మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. మీరు రూ.40 లక్షల వరకు ఇన్‌స్టంట్ లైఫ్ కవర్‌తో ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పేరుతో అందిస్తున్న ప్రత్యేక పాలసీ ఇది. ఎస్‌బీఐ కస్టమర్లు ఎవరైనా ఈ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్‌లో కేవలం కొన్ని క్లిక్స్‌తో సులభంగా ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ తీసుకోవచ్చు. ఇది గ్రూప్, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ. ఈ పాలసీ తీసుకున్నవారికి అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా మద్దతుగా నిలుస్తుంది ఈ పాలసీ. కనీసం రూ.1,00,000 నుంచి రూ.40,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ఎంచుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. ప్రతీ ఏటా ప్రీమియం కస్టమర్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది.

  IRCTC Tour: హైదరాబాద్ టు మేఘాలయ... ఐఆర్‌సీటీసీ హనీమూన్ ప్యాకేజీ వివరాలివే

  ATM Transaction Failed: అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా ఏటీఎంలో క్యాష్ రాలేదా? ఇలా చేయండి

  ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. పాలసీ టర్మ్ ఏడాది మాత్రమే. 55 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రెన్యువల్ చేయొచ్చు. ఈపాలసీ తీసుకున్నవారు మరణిస్తే సమ్ అష్యూర్డ్ నామినీకి అందిస్తారు. రైడర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ పాలసీపై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. మరి ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్‌లో ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

  Tata Sky: టాటా స్కై వాడుతున్నారా? ఈ ప్రోమో కోడ్‌తో డిస్కౌంట్ పొందండి

  RTGS Services: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి అలర్ట్... 14 గంటలపాటు ఆ‌ర్‌టీజీఎస్ సేవలు బంద్

  ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత insurance సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ Buy a Policy ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయాలి. ఆ తర్వాత SBI Life – Sampoorn Surakasha సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సమ్ అష్యూర్డ్, పుట్టిన తేదీ, నామినీ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాతి సెక్షన్‌లో హైట్, వెయిట్ సెలెక్ట్ చేయాలి. ఏవైనా అనారోగ్యాలు ఉంటే ఆ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. చివరగా పేమెంట్ అక్కడే పూర్తి చేయొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Insurance, Personal Finance, Sbi, State bank of india

  ఉత్తమ కథలు