హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ola వాడే వారికి గుడ్ న్యూస్... మీరు రైడ్ బుక్ చేస్తే ఇకపై క్యాన్సిల్ అయ్యే చాన్స్ చాలా తక్కువ.. ఎందుకంటే

Ola వాడే వారికి గుడ్ న్యూస్... మీరు రైడ్ బుక్ చేస్తే ఇకపై క్యాన్సిల్ అయ్యే చాన్స్ చాలా తక్కువ.. ఎందుకంటే

Good News to Ola Users | ఓలాలో రైడ్ బుక్ చేసినప్పుడు అది డ్రైవర్ క్యాన్సిల్ చేసినట్టు సమాచారం వస్తే చాలా చిరాకేస్తుంది. అయితే, ఇకపై ఇలాంటి సందర్భాలు మీకు చాలా తక్కువగా ఎదురవ్వొచ్చు. ఎందులో ఈ స్టోరీలో చదవండి.

  ఓలాలో (Ola App) రైడ్స్ బుక్ చేసేవారికి గుడ్ న్యూస్. మీకు అప్పుడప్పుడు ఓ సమస్య ఎదురై ఉంటుంది. ఎప్పుడైనా అర్జంట్ పని ఉన్నప్పుడు ఓలా బుక్ చేస్తే ఉన్నట్టుండి ఓలా రైడ్ క్యాన్సిల్  (Why Ola rides cancelled) అవుతూ ఉంటుంది. డ్రైవర్ రైడ్ ను క్యాన్సిల్ చేసినట్టు వస్తుంది. అలాంటి సమయాల్లో చాలా కోపం కూడా వస్తుంది. అర్జంట్ పని ఉంటే వీళ్లేంటి ఇలా చేస్తున్నారని కూడా అసహనం వస్తుంది. అయితే, ఇకపై ఇలాంటి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఓలా ముందుకొచ్చింది. తాజాగా ఓలా ఓ ప్రకటన చేసింది. ఓలా డ్రైవర్ల కోసం కొత్తగా ఓ ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటంటే, ఎవరైనా యూజర్ ఓలాలో రైడ్ బుక్ చేస్తే (Book ride in Ola) వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే గమ్యస్థానం డిటెయిల్స్‌తో పాటు వారు ఏ రకంగా డబ్బులు చెల్లిస్తారనే డిటెయిల్స్ కూడా అందులో డ్రైవర్లు తెలుసుకోవచ్చు.

  అంటే డ్రైవర్ డ్రాపింగ్ లొకేషన్ కూడా ముందే తెలుస్తుంది. అలాగే యూజర్ పేమెంట్ నగదు రూపంలో చేస్తారా? యూపీఐ పేమెంట్ చేస్తారా? లేకపోతే ఇతర మార్గాల్లో చేస్తారా? అనేది ముందే క్లియర్ గా తెలుస్తుంది. దీని వల్ల డ్రైవర్‌కు సులభం అవుతుంది. దీని వల్ల డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేసే సందర్భాలు చాలా తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. అలాగే, యూజర్లకు కూడా ఇలా రైడ్ క్యాన్సిల్ అయ్యే సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నట్టు ఓలా సీఈఓ ప్రకటించారు.

  చాలా మంది చాలా కాలంగా నన్ను పదే పదే అడిగే ప్రశ్నకు సమాధానం చెబుతున్నా. డ్రైవర్ ఓలా రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేస్తాడనేదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మేం కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఓలాలో డ్రైవర్ రైడ్‌ను ఆమోదించే ముందే డ్రాప్ లొకేషన్, పేమెంట్ విధానం తెలుసుకోవచ్చు. దీని వల్ల రైడ్ క్యాన్సిల్ అయ్యే సంఖ్య తగ్గుతుంది.

  భవిష్ అగర్వాల్, సీఈఓ, ఓలా

  ఇక నుంచి రైడ్ బుక్ చేయగానే డ్రైవర్‌కు కూడా తెలుస్తుంది కాబట్టి పేమెంట్ మోడ్ క్యాష్ అయితే వెళ్లడానికి ఇష్టపడతారు. అలాగే ఎక్కడికి వెళ్లాలనేది కూడా క్లియర్ గా ఉంటుంది కాబట్టి వారికి క్లియర్ గా తెలుస్తుంది. అయితే, ప్రాక్టికల్‌గా క్యాన్సిలేషన్ పెరిగే ప్రమాదం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఓ యూజర్ కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తే ఆ యూజర్ దగ్గర నగదు అందుబాటులో లేక డిజిటల్ పేమెంట్ ఆప్షన్ పెడితే అప్పుడు డ్రైవర్లు ఆ రైడ్‌ను ముందే క్యాన్సిల్ చేసే ప్రమాదం లేకపోలేదు.  ఎందుకంటే ఇప్పటికే యాప్ ఆధారితంగా సేవలు అందిస్తున్న డ్రైవర్ పార్టనర్లు తమకు ఆదాయం తగ్గుతోందని గత కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఓ దశలో హైదరాబాద్ లాంటి నగరంలో రోడ్డు మీద ధర్నాలు కూడా చేశారు. అయితే, కంపెనీ మాత్రం దీని వల్ల క్యాన్సిలేషన్లు తగ్గుతాయిని ఆశిస్తోంది.

  First published:

  Tags: Ola, Ola bikes

  ఉత్తమ కథలు