హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: ఐదు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... డబ్బులు తీసుకోవడానికి మరో ఛాన్స్

EPFO: ఐదు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... డబ్బులు తీసుకోవడానికి మరో ఛాన్స్

EPFO: ఐదు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... డబ్బులు తీసుకోవడానికి మరో ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: ఐదు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... డబ్బులు తీసుకోవడానికి మరో ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

EPF Second Covid 19 Advance | ఈపీఎఫ్ ఖాతాదారులు రెండోసారి కూడా కోవిడ్ 19 అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పించింది ఈపీఎఫ్ఓ. డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.

కరోనా కష్టకాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF ఖాతాదారులకు ఊరటనిచ్చే వార్త ఇది. గతంలో కోవిడ్ 19 ప్యాండమిక్ అడ్వాన్స్ తీసుకున్న ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు మరోసారి అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. దేశమంతా దాదాపుగా లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో గతేడాది నాటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి. సామాన్యులకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈపీఎఫ్ ఖాతాదారులు రెండోసారి కూడా కోవిడ్ 19 ప్యాండమిక్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. ఈ నిర్ణయం 5 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు మేలు చేయనుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు మూడు నెలల బేసిక్ వేతనం అంటే బేసిక్+డీఏ లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతంలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు ఆన్‌లైన్‌లోనే ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. మరి ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసుకోండి.

IRCTC Work from Hotel: ఐఆర్‌సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ ప్యాకేజీ... ధర రూ.7,710 మాత్రమే

EPF Account: రెండు పీఎఫ్ అకౌంట్స్ ఉన్నాయా? అయితే ఈ విషయం తెలుసుకోండి

EPF Covid 19 Pandemic Advance: కోవిడ్ 19 ప్యాండమిక్ అడ్వాన్స్ తీసుకోండి ఇలా


ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

ఆ తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌లో క్లెయిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

కొత్త పేజీ అవుతుంది. అందులో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ వివరాలన్నీ సరిచూసుకోవాలి.

ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్‌లోని చివరి నాలుగు అంకెల్ని ఎంటర్ చేయాలి.

వెరిఫై పైన క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెరిఫై అవుతుంది.

ఈ తర్వాత Proceed for online claim పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత PF advance (Form 31) సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

డ్రాప్ డౌన్ మెనూలో COVID-19 ఆప్షన్ ఎంచుకోవాలి.

ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాంకు చెక్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత అడ్రస్ ఎంటర్ చేయాలి.

ఈపీఎఫ్ ఖాతాదారుల ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీ ఎంటర్ చేసి క్లెయిమ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి.

మూడు నాలుగు రోజుల్లో ఈపీఎఫ్ అడ్వాన్స్ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది.

EPF Withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేయొచ్చో తెలుసుకోండి

EPFO Insurance: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.7,00,000 వరకు ఇన్స్యూరెన్స్... ఎలా పొందాలంటే

గతంలో కోవిడ్ 19 అడ్వాన్స్ తీసుకున్నవారు కూడా మరోసారి అడ్వాన్స్ తీసుకోవచ్చు. కోవిడ్ 19 మాత్రమే కాదు పెళ్లి, పిల్లల పైచదువులు, ఆరోగ్యం, ఇంటి నిర్మాణం, ఇంటి కొనుగోలు లాంటి కారణాలతో కూడా పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు.

First published:

Tags: Covid-19, EPFO, Personal Finance

ఉత్తమ కథలు