EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... కొత్త రూల్ అమలులోకి

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... కొత్త రూల్ అమలులోకి (ప్రతీకాత్మక చిత్రం)

EPFO | కరోనా వైరస్ సంక్షోభాన్ని కారణంగా చూపించి ఈపీఎప్ అకౌంట్ నుంచి అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించింది ఈపీఎఫ్ఓ.

  • Share this:
    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఆధార్ కార్డునే బర్త్ సర్టిఫికెట్‌గా ఉపయోగించొచ్చని సూచించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈపీఎఫ్ సేవల్ని ఆన్‌లైన్‌లో పొందుతున్నారు ఖాతాదారులు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఈపీఎఫ్ఓ పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీని ప్రారంభించింది. ఖాతాదారులు కరోనా వైరస్ మహమ్మరిని ఓ కారణంగా చూపించి పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం ఇది. మూడు నెలల బేసిక్, డీఏ డ్రా చేసుకోవచ్చు. అయితే కేవైసీ పూర్తి చేయనివారికి డబ్బులు డ్రా చేసుకోవడంలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంపాదించడం కష్టం. అందుకే ఆధార్ కార్డునే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా సబ్మిట్ చేయొచ్చని ఈపీఎఫ్ఓ స్పష్టతనిచ్చింది.


    ఈపీఎఫ్ ఖాతాదారుల ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌నే పరిగణలోకి తీసుకోనుంది ఈపీఎఫ్ఓ. గత మూడేళ్లలో ఖాతాదారులు రెండు వేర్వేరు తేదీలను ఇస్తే తమ అకౌంట్‌లో పుట్టిన తేదీని సరిదిద్దడానికి ఆధార్ కార్డును ప్రూఫ్‌గా సబ్మిట్ చేయొచ్చు. ఇందుకోసం కరెక్షన్ రిక్వెస్ట్‌ను ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. మీ కేవైసీ పూర్తి చేసిన తర్వాత పీఎఫ్ అకౌంట్‌ నుంచి ఆన్‌లైన్‌లో సులువుగా డబ్బులు డ్రా చేయొచ్చు. మూడు రోజుల్లోనే మీ బ్యాంకు అకౌంట్‌లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి. మరి మీ పీఎఫ్ అకౌంట్ నుంచి విత్‌డ్రా ఎలా చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. మీ పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తే ఎంత నష్టమంటే...

    SBI phone banking: మీ ఫోన్ నుంచే ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు ఇలా

    EMI moratorium: ఈఎంఐ వాయిదాకు అప్లై చేయండిలా...
    Published by:Santhosh Kumar S
    First published: