గుడ్ న్యూస్: రూ.9 తగ్గిన పెట్రోల్ ధర

40 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే పెట్రోల్‌పై 40 పైసలు, 41 పైసలు తగ్గింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధరలు ముంబైలో రూ.81.50, చెన్నైలో రూ.78.46, కోల్‌కతాలో రూ.77.53. ఇక డీజిల్ విషయానికొస్తే లీటర్ ధర హైదరాబాద్‌లో రూ.76.77, ముంబైలో రూ.73.91, కోల్‌కతాలో రూ.72.41, చెన్నైలో రూ.74.55.

news18-telugu
Updated: November 23, 2018, 3:43 PM IST
గుడ్ న్యూస్: రూ.9 తగ్గిన పెట్రోల్ ధర
గుడ్ న్యూస్: 50 రోజుల్లో రూ.9 తగ్గిన పెట్రోల్ ధర
  • Share this:
రెండు నెలల క్రితం సామాన్యులకు చుక్కలు చూపించిన పెట్రోల్ ధరలు మెల్లిమెల్లిగా దిగొస్తున్నాయి. అక్టోబర్ 4న హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.06 ఉండేది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 80.12. అప్పట్నుంచి ఇప్పటి వరకు రూ.8.94 తగ్గింది. అంటే సుమారు రూ.9. ఈ 50 రోజుల్లో పెట్రోల్‌పై రూ.9 తగ్గడం సామాన్యులకు నిజంగా ఊరటే. పెట్రోల్ ధరలు తగ్గడానికి పలు కారణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల్ని సడలించడం... చమురు ధరలు తగ్గడానికి కారణాలు.

40 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే పెట్రోల్‌పై 40 పైసలు, 41 పైసలు తగ్గింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధరలు ముంబైలో రూ.81.50, చెన్నైలో రూ.78.46, కోల్‌కతాలో రూ.77.53. ఇక డీజిల్ విషయానికొస్తే లీటర్ ధర హైదరాబాద్‌లో రూ.76.77, ముంబైలో రూ.73.91, కోల్‌కతాలో రూ.72.41, చెన్నైలో రూ.74.55.

ఇవి కూడా చదవండి:

రెడ్‌మీ నోట్ 6 ప్రో ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూశారా?పేటీఎం కొత్త స్కీమ్... బ్యాంకు ఎఫ్‌డీ కన్నా ఎక్కువ లాభం

భార్యాభర్తలకు ప్రత్యేకం: ఈ 3 సెకండ్స్ ట్రిక్ తెలుసా?

వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? మీకు బ్యాడ్ న్యూస్ఒత్తిడి తగ్గించుకోవాలా? ఈ ఆహారం తినండి...
First published: November 23, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>