EPFO pension: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త... రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్

EPFO pension | రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగి చివరి వేతనాన్ని పరిగణలోకి తీసుకొని పెన్షన్ ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేయడంతో కేరళ హైకోర్టు తీర్పు అమలులోకి రానుంది.

news18-telugu
Updated: April 2, 2019, 12:27 PM IST
EPFO pension: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త... రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్
EPFO pension: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త... రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్
  • Share this:
మీరు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా? నెలనెలా ఈపీఎఫ్‌ఓలో డబ్బులు జమ చేస్తున్నారా? అయితే రిటైర్మెంట్ తర్వాత మీకు అధిక పెన్షన్ దక్కనుంది. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎస్ అర్హత కోసం గరిష్ట వేతనం రూ.15,000 పరిమితి విధించింది ఈపీఎఫ్ఓ. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా ఇదే ప్రాతిపదికన చెల్లిస్తోంది. ఈ నిబంధన సరికాదని, ఆఖరి వేతనాన్ని పరిగణలోకి తీసుకొని పెన్షన్ ఇవ్వాలంటూ గతంలో కేరళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేరళ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈపీఎఫ్ఓ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చారు. స్పెషల్ లీవ్ పిటిషన్ అర్హత లేదని తిరస్కరించారు.

Read this: Banks Merger: మూడు బ్యాంకుల విలీనం పూర్తి... కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే

గరిష్ట పరిమితి రూ.15,000 కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్‌కు అర్హులు కాదంటూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో 2014లో సవరణల్ని చేసింది ఈపీఎఫ్ఓ. ఈ సవరణల్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. 2018లో ఈపీఎఫ్ఓ సవరణల్ని రద్దు చేసింది కేరళ హైకోర్టు. రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగి చివరి వేతనాన్ని పరిగణలోకి తీసుకొని పెన్షన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేయడంతో కేరళ హైకోర్టు తీర్పు అమలులోకి రానుంది.

రూ.15,000 వరకు వేతనం ఉన్న ఉద్యోగులు బేసిక్ సాలరీ, డీఏలో 12 శాతం జమ చేయాలి. సంస్థ యాజమాన్యం కూడా 12 శాతం జమచేయడం తప్పనిసరి. యజమాని వాటాను రెండు భాగాలుగా విభజిస్తారు. ఈపీఎఫ్ 3.67% కాగా, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 8.33%.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:Realme Discount: రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ధర రూ.9,999 మాత్రమే

RRB Level-1 Jobs: దరఖాస్తుకు ఏప్రిల్ 12 చివరి తేదీ... సికింద్రాబాద్‌‌లో 9,328 ఖాళీలు

SBI: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేయండి
First published: April 2, 2019, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading