హోమ్ /వార్తలు /బిజినెస్ /

UPI App: గుడ్ న్యూస్... ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు

UPI App: గుడ్ న్యూస్... ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు

UPI App: గుడ్ న్యూస్... ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

UPI App: గుడ్ న్యూస్... ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

ATM Cash Withdrawal | జేబులో ఏటీఎం కార్డులు పెట్టుకొని తిరిగే రోజులు ఇక ఉండకపోవచ్చు. ఏటీఎం కార్డు (ATM Card) లేకుండానే ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్యాష్ విత్‌డ్రా చేసే టెక్నాలజీ వచ్చేసింది.

ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు (ATM Card) కావాలి. ఇది ఒకప్పుడు. ఏటీఎం కార్డు లేకపోయినా ఇప్పుడు డబ్బులు డ్రా (Cash Withdrawal) చేయొచ్చు. చాలావరకు బ్యాంకులు తమ సొంత బ్యాంకింగ్ యాప్స్‌లో (Banking Apps) ఈ ఫీచర్ అందిస్తున్నాయి. ఇప్పడు మరో టెక్నాలజీ వచ్చేసింది. ఇకపై ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డులు, బ్యాంకింగ్ యాప్స్ కూడా అవసరం లేదు. ఏదైనా యూపీఐ యాప్ ఉంటే చాలు. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సింపుల్‌గా క్యాష్ డ్రా చేయొచ్చు. ఏటీఎం తయారీ సంస్థ అయిన ఎన్‌సీఆర్ కార్పొరేషన్ తీసుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ ఇది. ఇంటర్‌ఆపరేబుల్ కార్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించింది.

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారా ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు. సిటీ యూనియన్ బ్యాంక్‌తో కలిసి ఏటీఎంలల్లో ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది ఎన్‌సీఆర్ కార్పొరేషన్. 1500 పైగా ఏటీఎంలల్లో ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఉంది. మరిన్ని ఏటీఎంలల్లో ఈ టెక్నాలజీ తీసుకొచ్చేందుకు ఎన్‌సీఆర్ కార్పొరేషన్ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సదుపాయం ద్వారా రూ.5,000 మాత్రమే డ్రా చేయొచ్చు. మరి క్యూఆర్ కోడ్ ద్వారా ఏటీఎంలో డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.

Money Transfer: యూపీఐ పనిచేయట్లేదా? వెంటనే మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

ATM Cash Withdrawal: క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు డ్రా చేయండి ఇలా


ఏటీఎం సెంటర్‌లో స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే, పేటీఎం, భీమ్, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్ ఓపెన్ చేయాలి.

ఏటీఎం స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.

ఆ తర్వాత మీరు ఎంత డ్రా చేయాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయాలి.

ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.

మీరు ఎంటర్ చేసిన డబ్బులు డ్రా అవుతాయి.

Investment: రూ.20,000 పెట్టుబడి... కోటి రూపాయల రిటర్న్స్... ఎలాగంటే

ATM Cash Withdrawal: బ్యాంకింగ్ యాప్ ద్వారా డబ్బులు డ్రా చేయండి ఇలా


మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేయాలి.

అందులో కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఎంచుకోవాలి.

మీరు ఎంత డ్రా చేయాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయాలి.

పిన్ జనరేట్ చేయాలి.

ఆ తర్వాత సొంత బ్యాంక్ ఏటీఎంకు వెళ్లాలి.

ఏటీఎంలో కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

మీరు క్రియేట్ చేసిన పిన్ ఎంటర్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీ ఎంటర్ చేసి నగదు విత్‌డ్రా చేయాలి.

First published:

Tags: ATM, Atm Card, BHIM UPI, Google pay, Paytm, Personal Finance, PhonePe, UPI

ఉత్తమ కథలు