New Rule: వాహనదారులకు శుభవార్త... ఇక ఎన్ఓసీ అవసరం లేదు

గతంలో ఆన్‌లైన్ వ్యవస్థ లేని సమయంలో మ్యాన్యువల్‌గా లైసెన్సులు జారీ చేసేవాళ్లు కాబట్టి ఎన్ఓసీ అడిగేవాళ్లు. ఇకపై అవసరం లేదని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.

news18-telugu
Updated: March 5, 2019, 6:01 PM IST
New Rule: వాహనదారులకు శుభవార్త... ఇక ఎన్ఓసీ అవసరం లేదు
New Rule: వాహనదారులకు శుభవార్త... ఇక ఎన్ఓసీ అవసరం లేదు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 5, 2019, 6:01 PM IST
మీరు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించాలనుకుంటున్నారా? లైసెన్స్‌లో అడ్రస్ మార్చాలనుకుంటున్నారా? దీనికోసం ఇన్నాళ్లూ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) తప్పనిసరి. కానీ ఇకపై నిరభ్యంతర ధృవపత్రం అవసరం లేదని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని రవాణా శాఖ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఓసీ అవసరం ఏంటన్నది కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వాదన. గతంలో ఆన్‌లైన్ వ్యవస్థ లేని సమయంలో మ్యాన్యువల్‌గా లైసెన్సులు జారీ చేసేవాళ్లు కాబట్టి ఎన్ఓసీ అడిగేవాళ్లు. ఇకపై అవసరం లేదని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.

Read this: JIO Feature: జియో యూజర్లకు స్పెషల్ ఫీచర్... ఇలా యాక్టివేట్ చేసుకోండి

నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలంటూ వాహనదారుల్ని వేధించకూడదని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చెప్పినట్టైంది. కొత్త ఉత్తర్వులు ఫిబ్రవరి 28న అమలులోకి వచ్చేశాయి. ఇప్పటివరకు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ మార్చుకోవాలంటే సొంత రాష్ట్రంలోని ఆర్‌టీఏ ఆఫీస్ నుంచి ఎన్ఓసీ అవసరమయ్యేది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడం, అడ్రస్ మార్చుకోవడంలో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇదే అంశంపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఏ వాహనదారుడికి సంబంధించిన సమాచారమైనా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఆ సమాచారాన్ని ఆర్‌టీఏకు చెందిన 'సారథి' సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక ఎన్ఓసీ అవసరం లేదు.

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

IRCTC Food: ఐఆర్‌సీటీసీ ఫుడ్ ప్యాకెట్లపై ఇక బార్ కోడ్స్... ఎందుకో తెలుసా?
Loading...
Realme 3 Release: ఆకట్టుకునే ఫీచర్లతో రియల్‌మీ 3 రిలీజ్... ధర రూ.8,999
First published: March 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...