హోమ్ /వార్తలు /బిజినెస్ /

Fastag: వాహనదారులకు గుడ్ న్యూస్... ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు

Fastag: వాహనదారులకు గుడ్ న్యూస్... ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Fastag | మీరు మీ వాహనానికి ఇంకా పాస్ట్ ట్యాగ్ తీసుకోలేదా? అయితే మీకు గుడ్ న్యూస్. గడువు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.

వాహనదారులకు శుభవార్త. ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవడానికి డెడ్‌లైన్ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. 2021 జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఇంకా ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోని వాహనదారులు ఉన్నారు. వారికి మరో అవకాశం కల్పిస్తూ 2021 ఫిబ్రవరి 15 వరకు గడువు పొడిగించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI. రహదారులపై టోల్ ప్లాజాల దగ్గర 2021 జనవరి 1 నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుమతించమని గతంలోనే NHAI స్పష్టం చేసింది. ప్రస్తుతం టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌ల ద్వారా పేమెంట్స్ 75-80% జరుగుతున్నాయి. అంటే మిగతా లావాదేవీలు నగదు ద్వారా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి 100 శాతం క్యాష్ లెస్ టోల్ ఫీజ్ కలెక్షన్ లక్ష్యంగా పెట్టుకుంది NHAI. నగదు లావాదేవీలు లేకుండా చేసేందుకు టోల్ ప్లాజాల్లో అన్ని లేన్లను ఫాస్టాగ్‌ లేన్లుగా మారుస్తోంది. అంటే ఫోర్ వీలర్ టోల్ ప్లాజా దాటాలంటే వాహనానికి తప్పనిసరిగా ఫాస్టాగ్‌ ఉండాల్సిందే. లేకపోతే సాధారణ ఛార్జీల కన్నా రెట్టింపు ఛార్జీలు చెల్లించకతప్పదు.

"నగదుతో లావాదేవీలు జరపడం చట్టబద్ధమే. నగదు ద్వారా లావాదేవీలను ఎవరూ తిరస్కరించలేరు. అయితే మోటార్ వెహికిల్ రూల్‌ను కఠినంగా అమలు చేయడానికి వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేశాం" అని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI ప్రకటన విడుదల చేసింది.

January 2021 Bank Holidays: జనవరిలో బ్యాంకులకు 10 సెలవులు... ఎప్పుడంటే

New Rules from January 1: అందరికీ అలర్ట్... రేపటి నుంచి మారే 12 రూల్స్ ఇవే

టోల్‌ గేట్ల దగ్గర టోల్ ఫీజును సులభంగా వసూలు చేయడంతో పాటు, రద్దీ తగ్గించాలన్న లక్ష్యంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌ ఫాస్ట్‌ ట్యాగ్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోని జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లేన్లను ఏర్పాటు చేసింది. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఈ లేన్ల నుంచి ఆగకుండా వెళ్లిపోవచ్చు. దీని వల్ల టోల్ ప్లాజాల దగ్గర రద్దీ తగ్గుతోంది. అందుకే దేశంలోని అన్ని టోల్ ప్లాజాల దగ్గర లేన్లను 100 శాతం ఫాస్టాగ్ లేన్లుగా మార్చాలన్నది NHAI లక్ష్యం. టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ ఉంటేనే ఇది సాధ్యమవుతోంది. అందుకే వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాలని కేంద్రం కోరుతోంది. ఇప్పటివరకు ఫాస్టాగ్ తీసుకోని వారికి 2021 ఫిబ్రవరి 15 వరకు అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ వాహనాలు, ప్రైవేట్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి.

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్

Telangana Holidays 2021: తెలంగాణలో 2021 హాలిడేస్ లిస్ట్ ఇదే... సెలవులు ఎప్పుడంటే

వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా పేమెంట్ జరుగుతుంది. వాహనదారుల సేవింగ్స్ అకౌంట్ లేదా వ్యాలెట్ నుంచి టోల్ ఫీజు చెల్లింపు జరిగిపోతుంది. టోల్ ఛార్జీ చెల్లించేందుకు వాహనదారులు వాహనాన్ని టోల్ ప్లాజా దగ్గర ఆపాల్సిన అవసరం లేదు. వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్‌లను టోల్ ప్లాజాలు, పెట్రోల్ బంకులు, బ్యాంకుల దగ్గర తీసుకోవచ్చు. పేటీఎం, అమెజాన్ లాంటి యాప్స్ కూడా ఫాస్ట్ ట్యాగ్స్ అమ్ముతుంటాయి.

First published:

Tags: FASTag, Motor vehicle act