Good News: ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న ఇన్స్యూరెన్స్ ప్రీమియం

కొన్ని దేశాల్లో మరణాల రేటును ప్రతీ ఏడాది సవరిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో మాత్రం 5-6 ఏళ్లకు సవరిస్తారు. 2012-14 లెక్కల ప్రకారం 22 నుంచి 50 ఏళ్ల వయస్సుగలవారి మరణాల రేటు 4 నుంచి 16 శాతం తగ్గడం విశేషం.

news18-telugu
Updated: March 12, 2019, 9:39 AM IST
Good News: ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న ఇన్స్యూరెన్స్ ప్రీమియం
Good News: ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న ఇన్స్యూరెన్స్ ప్రీమియం
  • Share this:
ఏప్రిల్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ ప్రీమియం తగ్గనుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. 22 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందుకు కారణం ఏప్రిల్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ మరణాల రేటుకు సంబంధించిన కొత్త డేటా ఫాలో కావడమే. ప్రస్తుతం ఇన్స్యూరెన్స్ ప్రీమియంను నిర్ణయించేందుకు 2006-08 నాటి మరణాల రేటును పరిగణలోకి తీసుకుంటున్నాయి ఇన్స్యూరెన్స్ కంపెనీలు. ఇకపై 2012-2014 నాటి మరణాల రేటు బట్టి ఇన్స్యూరెన్స్ ప్రీమియంను నిర్ణయిస్తాయి. ఈ డేటాను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఇన్స్యూరెన్స్ ప్రీమియం తీసుకుంటున్న 22 నుంచి 50 ఏళ్ల వయస్సువారి మరణాల రేటు 4 నుంచి 16 శాతం తగ్గింది. దీంతో ఇన్స్యూరెన్స్ ప్రీమియం కూడా తగ్గనుంది.

Read this: Credit Card: క్రెడిట్ కార్డు వాడేప్పుడు ఈ 8 తప్పులు చేస్తున్నారా?

ఈ కొత్త మార్పు టర్మ్ ఇన్స్యూరెన్స్‌పై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశముంది. అయితే 50 ఏళ్లు పైబడి ఉన్నవారి ప్రీమియంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎక్కువ వయస్సు ఉన్నవారి ప్రీమియం ఇంకాస్త పెరిగే అవకాశముంది. 82 నుంచి 105 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో మరణాల రేటు 3 నుంచి 21 శాతానికి పెరిగింది. ఇక మహిళల మరణాల రేటు కూడా తగ్గింది. ఆ నివేదిక ప్రకారం 14 నుంచి 44 ఏళ్ల వయస్సు గల మహిళల మరణాల రేటు 4.5 శాతం నుంచి తగ్గింది. కొన్ని దేశాల్లో మరణాల రేటును ప్రతీ ఏడాది సవరిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో మాత్రం 5-6 ఏళ్లకు సవరిస్తారు. 2012-14 లెక్కల ప్రకారం 22 నుంచి 50 ఏళ్ల వయస్సుగలవారి మరణాల రేటు 4 నుంచి 16 శాతం తగ్గడం విశేషం.

Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:

Realme 3 Sale: రేపే రియల్‌మీ 3 సేల్... ధర రూ.8,999... జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్డిగ్రీ ఉంటే చాలు... బ్యాంక్ ఆఫ్ బరోడాలో 100 ఉద్యోగాలు...

Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి
First published: March 12, 2019, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading