దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా భారతీయ రైల్వే మొదట మార్చి 31 వరకు, ఆ తర్వాత ఏప్రిల్ 14 వరకు అన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే రైలు టికెట్ల రీఫండ్‌పై ప్రయాణికుల్లో అనేక అనుమానాలున్నాయి.
ఇప్పటికే వీటిపై క్లారిటీ ఇచ్చింది రైల్వే. మరోసారి స్పష్టతనిస్తూ నోటీస్ జారీ చేసింది. అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో మార్చి 21 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ ఇస్తామని రైల్వే ప్రకటించింది. ఏఏ టికెట్లకు ఫుల్ రీఫండ్ వర్తిస్తుందో వివరించింది. ఇండియన్ రైల్వేస్ ఇచ్చిన నోటీస్ ప్రకారం ఫుల్ రీఫండ్ లభించేది వీళ్లకే.
కౌంటర్లో బుక్ చేసిన పీఆర్ఎస్ టికెట్లు: మార్చి 27 లోపు క్యాన్సిల్ చేసిన టికెట్లు: ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలతో టికెట్ డిపాజిట్ రిసిప్ట్-TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది. అన్ని జోనల్ రైల్వేస్ హెడ్‌క్వార్టర్స్‌లోని చీఫ్ కమర్షియల్ మేనేజర్ (CCM) (Claims) లేదా చీఫ్ క్లెయిమ్స్ ఆఫీసర్ (CCO) టీడీఆర్ ఫామ్‌ను 2020 జూన్ 21 లోగా ఇవ్వాలి. పీఎన్ఆర్ నెంబర్, రైలు నెంబర్, ప్రయాణ తేదీ, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ క్లాస్, మొబైల్ నెంబర్, టికెట్ క్యాన్సిల్ చేసిన తేదీ, క్యాన్సలేషన్ కోసం ఎంత డిడక్ట్ చేశారు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలన్నీ దరఖాస్తులో ఉండాలి. అంటే రైలు టికెట్లు క్యాన్సిల్ చేసినవాళ్లు కూడా దరఖాస్తు చేసి ఫుల్ రీఫండ్ పొందే అవకాశం కల్పిస్తోంది రైల్వే. మార్చి 27 తర్వాత క్యాన్సిల్ చేసిన రైలు టికెట్లపై ఫుల్ రీఫండ్ వస్తుంది.
ఇ-టికెట్స్: మార్చి 27 కన్నా ముందు టికెట్లు క్యాన్సిల్ చేసి రీఫండ్ పొందినవారికి బ్యాలెన్స్ రీఫండ్ ప్రయాణికుల అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఐఆర్సీటీసీ ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంది. మార్చి 27 తర్వాత టికెట్లు క్యాన్సిల్ చేసినవారికి ఆటోమెటిక్‌గా ఫుల్ రీఫండ్ వచ్చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
EPF Withdrawal: ఈపీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి... కొత్త రూల్స్ ఇదే
Banks Merger: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే అలర్ట్
WhatsApp Banking: బ్యాంకులో పని ఉందా? మీ వాట్సప్‌లోనే సేవలు పొందండి ఇలాPublished by:Santhosh Kumar S
First published:March 30, 2020, 12:33 IST