Gold Rate: తులం బంగారం రూ.1800 తగ్గింది...పసిడి ప్రేమికులకు పండగే...

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 కేరట్లు) ధర రూ.38500 దిగువకు దిగి వచ్చింది. కాగా ఆగస్టు 29వ తేదీన దేశీయంగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డు ధర రూ.40220ను తాకింది. ఈ స్థాయి నుంచి బంగారం ధర పతనమవుతూ వచ్చింది.

news18-telugu
Updated: September 23, 2019, 7:13 PM IST
Gold Rate: తులం బంగారం రూ.1800 తగ్గింది...పసిడి ప్రేమికులకు పండగే...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 23, 2019, 7:13 PM IST
రానున్న పండగ సీజన్ బంగారం కొనుగోలు దారులకు వరాలను కురిపించింది. గత నెల రోజులుగా అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన బంగారం ధరలు ఇప్పుడే దిగి వస్తున్నాయి. గడిచిన 18 రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.1800 తగ్గుముఖం పట్టింది. ఫలితంగా ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 కేరట్లు) ధర రూ.38500 దిగువకు దిగి వచ్చింది. కాగా ఆగస్టు 29వ తేదీన దేశీయంగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డు ధర రూ.40220ను తాకింది. ఈ స్థాయి నుంచి బంగారం ధర పతనమవుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం నవరాత్రి, దీపావళి, ధన్‌తేరస్ నేపథ్యంలో బంగారం ధరలు దిగిరావడంతో పసిడి ప్రేమికుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...