Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?

Discount on Gold | 10 గ్రాముల బంగారం రూ.28220 ధరకే లభిస్తే మీరు పెట్టుబడి పెట్టేందుకు రెడీనా? అంత తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? సావరిన్ గోల్డ్ బాండ్ రూపంలో సెకండరీ మార్కెట్లో మీకు ఈ అవకాశం లభిస్తోంది.

news18-telugu
Updated: January 28, 2019, 5:37 PM IST
Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?
Gold Price Alert: 8 నెలల గరిష్ట స్థాయికి బంగారం ధర
  • Share this:
బంగారం... భారతీయులకు పెట్టుబడి మాత్రమే కాదు ఓ సెంటిమెంట్ కూడా. నగలు కొన్నా, బాండ్ కొన్నా బంగారాన్ని సెంటిమెంట్‌తో చూస్తుంటారు. అందుకే మార్కెట్‌లో బంగారానికి ఎప్పుడూ డిమాండే. 2018 డిసెంబర్ 31 నాటికి బంగారంపై 7% రిటర్న్స్ వచ్చాయి. నిఫ్టీ 50 ఇచ్చిన రిటర్న్స్ 3.13% మాత్రమే. షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ 6% రిటర్న్స్ ఇచ్చాయి. అయితే ఇటీవల బంగారం ధరలు చూసి కొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఒకవేళ బంగారంపై 10% డిస్కౌంట్ వస్తే మీరు కొంటారా? వదులుకుంటారా? 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర ప్రస్తుతం రూ.33454 ఉంది. ఒకవేళ ఆ బంగారం రూ.28220 ధరకే లభిస్తే మీరు పెట్టుబడి పెట్టేందుకు రెడీనా? అంత తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? సావరిన్ గోల్డ్ బాండ్ రూపంలో సెకండరీ మార్కెట్లో మీకు ఈ అవకాశం లభిస్తోంది.

ఇది కూడా చదవండి: Sovereign Gold Bond: గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడి లాభమా? నష్టమా?

Gold Rate Today, Gold Rate Today in Hyderabad, Gold Rate Today Telangana, Gold Rate Today tirupathi, Gold Rate Today ap, gold price today, sovereign gold bond scheme 2019, బంగారం ధర, నేడు బంగారు రేటు, ఈరోజు బంగారం రేటు, వెండి రేటు నేడు

సావరిన్ గోల్డ్ బాండ్ గురించి తెలిసింది చాలా తక్కువమందికే. ఫిజికల్ గోల్డ్ కొనకుండా బాండ్ రూపంలో బంగారాన్ని కొని పెట్టుబడి పెట్టేందుకు సావరిన్ గోల్డ్ బాండ్ ఉపయోగపడుతోంది. అయితే ఇప్పటికే సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నవాళ్లు సెకండరీ మార్కెట్‌లో అమ్మేస్తుంటారు. ఒక్కోసారి ఆ బాండ్స్ డిస్కౌంట్‌లో లభిస్తుంటాయి. 2025 నవంబర్‌లో మెచ్యూర్ అయ్యే సావరిన్ గోల్డ్ బాండ్(SGBDEC2512) నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఒక గ్రాము రూ.2822 ధరకే ట్రేడ్ అయింది. అంటే సుమారు 15% డిస్కౌంట్‌కే లభిస్తోంది. వాస్తవానికి బాండ్ ఎనిమిదేళ్ల వ్యవధితో లభిస్తుంది. ఐదేళ్లు పూర్తైన తర్వాత ఇన్వెస్టర్లు ముందుగానే ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. ప్రతీ ఏడాది 2.5% వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో బంగారం ధర ఎంత ఉంటే అంత చెల్లిస్తుంది ఆర్‌బీఐ. మెచ్యూరిటీ వరకు గోల్డ్ బాండ్స్ హోల్డ్ చేస్తే వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా లేదు. ఒకవేళ అంతకంటే ముందే రీడీమ్ చేసుకోవాలనుకుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ప్రస్తుతం పలు గోల్డ్ బాండ్స్ మార్కెట్‌లో ఈ ధరలకు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

Gold Rate Today, Gold Rate Today in Hyderabad, Gold Rate Today Telangana, Gold Rate Today tirupathi, Gold Rate Today ap, gold price today, sovereign gold bond scheme 2019, బంగారం ధర, నేడు బంగారు రేటు, ఈరోజు బంగారం రేటు, వెండి రేటు నేడు

సావరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల మంచి లాభాలు ఉన్నట్టు అయితే ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో ఎందుకు లభిస్తున్నాయన్న అనుమానం మీకు రావచ్చు. సెకండరీ మార్కెట్‌లో సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్ముతున్నవాళ్లు ఇప్పుడు ఇస్తున్న ధర కంటే తక్కువ ధరకే బాండ్స్ కొని ఉంటారు. వారికి ఇప్పుడు అమ్మినా లాభమే. ఇప్పుడు డబ్బు అవసరమై లేదా భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో అన్న అనుమానంతో వాటిని సెకండరీ మార్కెట్‌లో అమ్ముతుంటారు. సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి అవగాహన తక్కువ ఉన్నందున వాటి అమ్మకాలు, కొనుగోళ్లు తక్కువగానే ఉంటాయి. సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు డిమాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. బాండ్స్ తక్కువగానే అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు సావరిన్ గోల్డ్ బాండ్ కొని మెచ్యూరిటీ వరకు హోల్డ్‌ చేయకపోతే ఇలా డిస్కౌంట్ ధరకే అమ్మాల్సి వస్తుందన్నది నిపుణుల వాదన. అందుకే మీరు సావరిన్ గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకేసారి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఒకే బాండ్ కొనకుండా వేర్వేరు బాండ్స్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఒకే మెచ్యూరిటీ డేట్ ఉన్న బాండ్స్ కొంటే ఆ సమయానికి బంగారం ధరలు పడిపోయాయంటే మీరు రిస్క్‌లో పడ్డట్టే. అందుకే సెకండరీ మార్కెట్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ కొనేముందు వాటి మెచ్యూరిటీ డేట్, ధరలు తెలుసుకొని విశ్లేషించుకోవాలి.
ఇవి కూడా చదవండి:

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...

వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్, ఎమోజీలకు కొత్త లుక్

XIAOMI MI Days Sale: రెడ్‌మీ, పోకో ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించిన షావోమీ
Published by: Santhosh Kumar S
First published: January 28, 2019, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading