Ration Card News | కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు (Ration Card) కలిగిన వారికి తీపికబురు అందించే అవకాశం ఉంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. మోదీ సర్కార్ త్వరలోనే ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY)పై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. పేదలకు అందించే ఉచిత రేషన్‌ను సెప్టెంబర్ 30 తర్వాత కూడా పొడిగించే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఫుడ్ సెక్రటరీ సుదాన్సు పాండే మాట్లాడుతూ.. కేంద్రం త్వరలోనే ఉచిత రేషన్‌పై ఒక నిర్ణయం తీసుకోవచ్చన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాత్రం ఈయన తెలియజేయలేదు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన 2020 మార్చి నెలలో తీసుకువచ్చారు. దీనిలో భాగంగా 80 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉచితంగా బియ్యం అందిస్తున్నారు.
బైక్, స్కూటర్ కొనేందుకు చౌక వడ్డీకే రుణాలు ఇస్తున్న 20 బ్యాంకులు ఇవే!
ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం వస్తున్నాయి. అంటే ఒక కార్డులో నలుగురు ఉంటే.. 20 కేజీల ఉచిత బియ్యం వస్తాయి. ఈ ఉచిత బియ్యం అనేవి రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కోటాకు అదనమని గుర్తించుకోవాలి. లాక్ డౌన్‌లో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఈ స్కీమ్ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది.
కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ .. లక్షల మందికి ఊరట
ఉచిత బియ్యం స్కీమ్‌ను పొడిగిస్తుందా? లేదా? అని పాండేను ప్రశ్నిస్తే.. అది గవర్నమెంట్ నిర్ణయమని సమాధానం చెప్పారు. ఇది పెద్ద నిర్ణయమని, ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో ఈ స్కీమ్ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ చివరి వరకు పథకాన్ని పొడిగించారు.
మోదీ సర్కార్ మార్చి నెల చివరికి ఈ స్కీమ్‌పై రూ. 2.6 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సెప్టెంబర్ చివరి కల్లా మరో రూ. 80 వేల కోట్లు అదనంగా భారం పడింది. దీంతో ప్రభుత్వం మొత్తంగా పీఎంజీకేఏవై కింద రూ. 3.4 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ గడువును పొడిగించకపోవచ్చని కొంత మంది అంచనా వేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. స్కీమ్ గడువును పొడిగిస్తే మాత్రం చాలా మందికి ఊరట కలుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Free Ration, One nation one ration card, Ration card, Ration cards, Telangana ration card