HOME »NEWS »BUSINESS »good news for yes bank customers bank enables imps neft services ss

Yes Bank: యెస్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్

Yes Bank: యెస్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్
Yes Bank: (ప్రతీకాత్మక చిత్రం)

Yes Bank Updates | యెస్ బ్యాంక్ సంక్షోభం బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యెస్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది బ్యాంకు.

  • Share this:
    యెస్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త. మంగళవారం ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవల్ని పునరుద్ధరించింది బ్యాంకు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా వెల్లడించింది. ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవల పునరుద్ధరణతో యెస్ బ్యాంక్ కస్టమర్లకు కాస్త ఊరట లభించినట్టే. యెస్ బ్యాంక్ కస్టమర్లు ఐఎంపీఎస్, నెఫ్ట్ లావాదేవీలను ఉపయోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, లోన్ల ఈఎంఐలు చెల్లించాలనుకునేవారికి ఈ సేవలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం యెస్ బ్యాంక్‌లో విత్‌డ్రా పరిమితి రూ.50,000 మాత్రమే. ఆర్‌బీఐ యెస్ బ్యాంకుపై ఏప్రిల్ 3 వరకు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.


    ఏప్రిల్ 3 వరకు ఆర్‌బీఐ మారటోరియం విధించినా మార్చి 15 నాటికి ఈ విత్‌డ్రా పరిమితి తొలగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నియమించిన అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అయితే యెస్ బ్యాంకును ఆదుకోవడానికి ముందుకు వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రైవేట్ బ్యాంకును విలీనం చేసే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని బ్యాంకింగ్ సేవల్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. ఏప్రిల్ 3 లోగా అన్ని వ్యవహారాలు సర్దుకుంటాయని ప్రశాంత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఇవి కూాడా చదవండి:



    Home Loan: ఇంటి కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

    PAN card rule: మీ పాన్ నెంబర్‌ ఆఫీసులో ఇవ్వకపోతే జీతం కట్

    Indian Railways: రైలులో ఇచ్చే బ్లాంకెట్స్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసా?
    Published by:Santhosh Kumar S
    First published:March 10, 2020, 13:16 IST