హోమ్ /వార్తలు /బిజినెస్ /

Visakhapatnam Cruise Tour: విశాఖ నుంచి నౌకలో టూర్... ప్యాకేజీ వివరాలివే

Visakhapatnam Cruise Tour: విశాఖ నుంచి నౌకలో టూర్... ప్యాకేజీ వివరాలివే

Visakhapatnam Cruise Tour: విశాఖ నుంచి నౌకలో టూర్... ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Visakhapatnam Cruise Tour: విశాఖ నుంచి నౌకలో టూర్... ప్యాకేజీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Visakhapatnam Cruise Tour | విశాఖపట్నంవాసులతో పాటు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు క్రూజ్ టూర్ (Cruise Tour) అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు జూన్ 8న క్రూజ్ టూర్ ప్రారంభం కానుంది.

నౌకలో విహరించాలనుకునేవారికి గుడ్ న్యూస్. విశాఖపట్నం నుంచి క్రూజ్ టూర్ (Cruise Tour) అందుబాటులోకి వస్తోంది. కార్డేలియా సంస్థకు చెందిన ఎంప్రెస్ నౌక విశాఖపట్నం నుంచి ప్రయాణించనుంది. జూన్ 8న తొలి సర్వీస్ ప్రారంభం అవుతుంది. జూన్ 15, 22 తేదీల్లో కూడా క్రూజ్ టూర్ అందుబాటులో ఉంది. నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. పర్యాటకులు తమకు కావాల్సిన రోజు టూర్ ప్యాకేజీ ఎంచుకోవచ్చు. ఇక ఈ లగ్జరీ నౌకలో ఇంటీరియర్, ఓషియన్ వ్యూ, మినీ సూట్, సూట్ పేరుతో వేర్వేరు ప్యాకేజీలు ఉంటాయి. పర్యాటకులు ఎంచుకునే ప్యాకేజీని బట్టి ధర ఉంటుంది. ఈ నౌకలో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఇందులో భారతదేశానికి చెందిన ప్రయాణికులు మాత్రమే ప్రయాణించడానికి వీలుంది. మరి ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.

IRCTC Tours: రూ.20,000 లోపు విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజెస్

నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే...


మూడు రోజుల టూర్ ప్యాకేజీ మొదటి రోజు రాత్రి 8 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు మొదటి రోజు విశాఖ తీరంలో కార్డేలియా ఎంప్రెస్ నౌక ఎక్కాలి. ఆరోజు రాత్రి, రెండో రోజంతా సముద్ర ప్రయాణం ఉంటుంది. నౌకలో తిరుగుతూ సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. నౌకలోనే ఫుడ్ అందుబాటులో ఉంటుంది. అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. స్పా సేవలు పొందొచ్చు. మూడో రోజు ఉదయం 7 గంటలకు పుదుచ్చెరీ చేరుకుంటారు. అక్కడ్నుంచి చెన్నైకి ప్రయాణం మొదలవుతుంది. నాలుగో రోజు చెన్నై చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

IRCTC Tours: హైదరాబాద్ నుంచి రూ.12,000 లోపు టూర్ ప్యాకేజీలు ఇవే

విశాఖవాసులు చాలాకాలంగా క్రూజ్ టూర్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. విశాఖవాసులు మాత్రమే కాదు... తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇదో మంచి అవకాశం. ఇప్పటికే గోవా, ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల నుంచి క్రూజ్ టూర్ అందుబాటులో ఉంది. కార్డేలియా ఎంప్రెస్ నౌకలో లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. ఈ నౌకలో 1800 మందికి పైగా ప్రయాణించవచ్చు. 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తారు. 700 పైగా క్యాబిన్స్ ఉంటాయి. ఇందులో అడ్వెంచర్ యాక్టివిటీస్, ఐదు బార్లు, డీజే పార్టీ, థియేటర్, నైట్ క్లబ్, ఫిట్‌నెస్ సెంటర్, మూడు స్పెషల్ రెస్టారెంట్లు, లాంజెస్, లైవ్ బ్యాండ్స్, షాపింగ్, స్పా అండ్ సెలూన్, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. కొన్ని సర్వీసులు ఉచితంగా లభిస్తాయి. కొన్ని సేవలు పొందాలంటే ఛార్జీలు చెల్లించాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Tourism, Travel, Visakhapatnam

ఉత్తమ కథలు