Railways: ఇక టికెట్లు, బెర్తులు ఈజీగా దొరుకుతాయ్... భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయాలివే

Indian Railways | కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ ఫీచర్‌తో మీ టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవచ్చు. టికెట్ బుక్ చేయడం కన్నా ముందే ఈ విషయం తెలిసిపోతుంది.

news18-telugu
Updated: September 3, 2019, 11:45 AM IST
Railways: ఇక టికెట్లు, బెర్తులు ఈజీగా దొరుకుతాయ్... భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయాలివే
Railways: ఇక టికెట్లు, బెర్తులు ఈజీగా దొరుకుతాయ్... భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వే... నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ. మరోవైపు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC కూడా రైల్వే ప్రయాణికులకు టికెటింగ్‌తో పాటు మరిన్ని సేవలు అందిస్తోంది. ఇటీవల ఐఆర్‌సీటీసీతో పాటు ఇండియన్ రైల్వేస్‌లో అనేక మార్పులు జరిగాయి. అవన్నీ ప్రయాణికులకు మేలు చేసేవే. సులువుగా టికెట్లు, బెర్తులు కన్‌ఫామ్ చేయడానికి ఉపయోగపడే నిర్ణయాలవి. 120 రోజుల ముందే రైలు టికెట్లు తీసుకోవచ్చన్న విషయం ప్రయాణికులకు తెలిసిందే. అదే కాకుండా అనేక నిర్ణయాలు తీసుకుంటే రైల్వే. రియల్ టైమ్‌లో బెర్త్ స్టేటస్, పబ్లిక్ రిజర్వేషన్ చార్ట్స్, బయోమెట్రిక్ లింకింగ్... ఇలా భారతీయ రైల్వే తీసుకున్న కొత్త నిర్ణయాలతో ప్రయాణికులకు రైలు టికెట్ దొరకడం సులువైంది. మరి వాటితో ప్రయాణికులకు ఏ విధంగా ఉపయోగమో తెలుసుకోండి.

1. రిజర్వేషన్ చార్ట్స్: రిజర్వేషన్ విషయంలో ఎయిర్‌లైన్స్‌ని ఫాలో అవుతుంది భారతీయ రైల్వే. రిజర్వేషన్ చార్ట్స్‌ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా బెర్తులు ఏవైనా ఖాళీగా ఉంటే ప్రయాణికులు తెలుసుకోవచ్చు. రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్, 30 నిమిషాల ముందు రెండో చార్ట్ ప్రయాణికులకు కనిపిస్తుంది. ఒకవేళ బెర్త్ ఖాళీగా ఉంటే నేరుగా టీటీఈని కలిసి బెర్త్ కోసం అడగొచ్చు. ఒకవేళ బెర్త్ ఖాళీగా ఉన్నా లేదని టీటీఈ చెప్పే ఛాన్సే ఉండదు. టికెట్ల జారీలో పారదర్శకత పెంచడంతో పాటు రైల్వే సిబ్బందిలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఇండియన్ రైల్వేస్ తీసుకున్న నిర్ణయం ఇది. మరి చార్ట్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: Railways: భారతీయ రైల్వే ఎస్ఎంఎస్ సర్వీస్ గురించి మీకు తెలుసా?

Indian Railways, PNR Linking, CNF Probability, Biometric linking, Reservation charts, Hand-Held terminals, IRCTC ticket booking, ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే, పీఎన్ఆర్ లింకింగ్, కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ, బయోమెట్రిక్ లింకింగ్, రిజర్వేషన్ చార్ట్స్, హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్, ఐఆర్‌‌సీటీసీ టికెట్ బుకింగ్
(ప్రతీకాత్మక చిత్రం)


2. హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్: భారతీయ రైల్వే రాజధాని, శతాబ్ధి లాంటి ప్రీమియం రైళ్లల్లో హ్యాండ్-హెల్డ్ టెర్మినల్స్ ప్రవేశపెట్టింది. రైలు బయల్దేరక ముందే కాదు... కదిలే రైలులో బెర్త్ ఖాళీగా ఉందో లేదో తెలుసుకోవడం హ్యాండ్-హెల్డ్ టెర్మినల్స్ ద్వారా సులువు. రైల్వే సిబ్బంది హ్యాండ్ హెల్డ్ టర్మినల్-HHT ఉపయోగించి కదిలే రైలులో ఏవైనా ఖాళీలు ఉన్నాయేమోనని సులువుగా తెలుసుకొని వాటిని ప్రయాణికులకు కేటాయించొచ్చు. సోర్స్ ఛార్ట్స్, కరెంట్ బుకింగ్ లిస్ట్‌ని జీపీఆర్ఎస్ ద్వారా హ్యాండ్ హెల్డ్ టర్మినల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. దాంతో పాటు రైలు లొకేషన్స్‌లోని చార్ట్స్ కూడా డౌన్‌లోడ్ చేస్తారు. రైలు బయల్దేరిన తర్వాత ప్రతీ గంటకు క్యాన్సల్డ్ ప్యాసింజర్ల జాబితాను తీసుకుంటారు. హ్యాండ్ హెల్డ్ టర్మినల్‌లో ఏ కోచ్‌లో ప్రయాణించే ప్యాసింజర్ అటెండెన్స్‌ని మార్క్ చేయొచ్చు. ఏదైనా బెర్త్ ఖాళీగా ఉంటే ఆ తర్వాతి స్టేషన్‌ నుంచి బుకింగ్ చేసుకున్న వారికి బెర్త్ కేటాయిస్తారు. క్లాస్ అప్‌గ్రేడ్, డౌన్‌గ్రేడ్, ఆల్టర్నేట్ బెర్త్ అలాట్‌మెంట్ లాంటి వివరాలు హ్యాండ్ హెల్డ్ టర్మినల్‌లో ఉంటాయి. ఈ కొత్త డివైజ్‌లతో పేపర్ చార్టుల స్థానంలో ఇ-చార్టులుంటాయి.

3. బయోమెట్రిక్ లింకింగ్: టికెట్ రిజర్వేషన్ చేయించుకొని బెర్త్ కన్‌ఫామ్ చేసుకొని రైలు ఎక్కితే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ జనరల్ బోగీలో ప్రయాణం అంటే అబ్బో నరకమే అనుకుంటారు రైల్వే ప్యాసింజర్స్. ఆ సమస్యకు చెక్ పెడుతూ పశ్చిమ రైల్వేలో బయోమెట్రిక్ లింకింగ్ ప్రవేశపెట్టింది భారతీయ రైల్వే. జనరల్ టికెట్లు కొనేవారు బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్రల్ని స్కాన్ చేయిస్తే ఓ టోకెన్ లభిస్తుంది. రైలు వచ్చినప్పుడు తమ దగ్గరున్న టోకెన్ నెంబర్ ఆధారంగా క్యూలో నిలబడాలి. టోకెన్ నెంబర్ ఆధారంగా వారికి జనరల్ బోగీలో సీట్లు లభిస్తాయి. ఎవరైనా దౌర్జన్యంగా సీట్లను ఆక్రమించుకోవడం, దబాయించడం లాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరీక్షిస్తోంది రైల్వే.

Read this: IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Indian Railways, PNR Linking, CNF Probability, Biometric linking, Reservation charts, Hand-Held terminals, IRCTC ticket booking, ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే, పీఎన్ఆర్ లింకింగ్, కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ, బయోమెట్రిక్ లింకింగ్, రిజర్వేషన్ చార్ట్స్, హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్, ఐఆర్‌‌సీటీసీ టికెట్ బుకింగ్
(ప్రతీకాత్మక చిత్రం)


4. కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ: గతంలో రైలు టికెట్ బుక్ చేస్తే బెర్త్ కన్ఫామ్ అవుతుందా లేదా అన్న విషయం ఓ సస్పెన్స్‌లా ఉండేది. కానీ ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ ఫీచర్‌తో మీ టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవచ్చు. టికెట్ బుక్ చేయడం కన్నా ముందే ఈ విషయం తెలిసిపోతుంది. కాబట్టి టికెట్ బుక్ చేయాలా వద్దా అన్న నిర్ణయం మీ చేతుల్లో ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్‌ చూపించినట్టైతే మీరు CNF Probability పైన క్లిక్ చేస్తే మీకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుస్తుంది. టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు 30 శాతం కన్నా తక్కువ ఉన్నట్టైతే టికెట్ బుక్ చేయకపోవడమే మంచిది. వేరే ట్రైన్‌ ట్రై చేయొచ్చు.

5. పీఎన్ఆర్ లింకింగ్: దూరప్రయాణం ప్లాన్ చేసుకునే ప్రయాణికులకు ఉపయోగపడే ఫీచర్ ఇది. మీరు గమ్యస్థానానికి చేరేందుకు రెండుమూడు రైళ్లు బుక్ చేసుకున్నట్టైతే... మొదటి రైలు ఆలస్యంగా వస్తే ఇతర రైళ్లు సమయానికి అందుకోవడం కష్టమే. దీంతో మీరు రైలు మిస్ అవడమే కాకుండా మీ ప్రయాణం డిస్టర్బ్ అవుతుంది. టికెట్ డబ్బులూ నష్టపోవాల్సి వస్తుంది. అందుకే భారతీయ రైల్వే పీఎన్ఆర్ లింకింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. కనెక్టింగ్ ట్రైన్స్ ఉన్నట్టైతే వాటి పీఎన్ఆర్ నెంబర్లను లింక్ చేయాలి. మొదటి రైలు ఆలస్యం కారణంగా రెండో రైలు మిస్ అయితే రీఫండ్ పొందొచ్చు. పీఎన్ఆర్ లింకింగ్ నియమ నిబంధనలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC: రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్... ప్రైవేట్ రైళ్లల్లో కన్సెషన్, కోటా ఉండవు
Published by: Santhosh Kumar S
First published: September 3, 2019, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading