హోమ్ /వార్తలు /బిజినెస్ /

Good News For Railway Passengers: ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో మూడు కొత్త టాయ్ ట్రైన్స్..

Good News For Railway Passengers: ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో మూడు కొత్త టాయ్ ట్రైన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మూడు కొత్త టాయ్ ట్రైన్స్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వే (Indian Railway) సిద్ధమయ్యింది. 118 ఏళ్ల తరువాత ఈ రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ రైల్వే కొత్త టాయ్ రైళ్లను ప్రవేశ పెడుతుండటం విశేషం.

పర్వతాల్లో ఇరుకైన మార్గాల్లో ఉండే చిన్న ట్రాక్‌లపై స్మాల్ ఇంజన్లతో రన్ అయ్యే ట్రైన్లను టాయ్ ట్రైన్స్ (Toy Trains) అని అంటారు. వీటిలో చేసే జర్నీ ప్రయాణికులకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు కూడా ఈ ట్రైన్స్ బెస్ట్ గా నిలుస్తాయి. అయితే ఇలాంటి మూడు కొత్త టాయ్ ట్రైన్స్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వే (Indian Railway) సిద్ధమయ్యింది. 118 ఏళ్ల తరువాత ఈ రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ రైల్వే కొత్త టాయ్ రైళ్లను ప్రవేశ పెడుతుండటం విశేషం. ఈ ఏడాది చివరి నాటికి సిమ్లా-కల్కా మార్గం (Shimla-Kalka Route)లో ఈ మూడు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. కల్కా-సిమ్లా టాయ్ రైళ్ల కోచ్‌లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్)లో తయారు చేస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. మరి ఈ ట్రైన్ల డిజైన్, ఫెసిలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ వివరాలు

* టాయ్ ట్రైన్ డిజైన్

కొత్త రైలు కోచ్‌లను జర్మన్ తయారీదారు లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) రూపొందించారు. 765 mm నారో గేజ్‌ని ఉపయోగించే టాయ్ రైళ్లలో మొత్తం 30 న్యూ జనరేషన్ ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లు ఉంటాయి.

* ఫెసిలిటీస్

కొత్త రైళ్లలో ఏసీ కోచ్‌లలో 180 డిగ్రీల రొటేటబుల్ కుర్చీ సీట్లు, జనరల్ సీటింగ్ (GS) కోచ్‌లలో ఫ్లిప్-టైప్ సీటింగ్ ఏర్పాటు ఉంటుంది. ఈ రైలులో సీసీటీవీలు, ఒక్కో కోచ్‌లో రెండు ఎమర్జెన్సీ అలారం పుష్ బటన్‌లు, ప్యాసింజర్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం వైఫై, సింక్-ఇన్ ఎల్‌ఈడీ డెస్టినేషన్ బోర్డు ఉంటాయని అధికారి ఒకరు దినపత్రికకు తెలిపారు.

* కోచ్‌లు

కొత్త కల్కా-సిమ్లా టాయ్ రైళ్లు ప్రైవేట్ లేదా గ్రూప్ బుకింగ్‌ల విషయంలో సీటింగ్ ప్యాటర్న్‌లలో మార్పులను అనుమతిస్తుంది. కోచ్‌లు విస్టాడోమ్ (Vistadome) కోచ్‌లుగా ఉంటాయి. ఇవి విశాలమైన పనోరమిక్ వీక్షణ (Panoramic View)ను అందిస్తాయి. ఇందులో పైకప్పులో గ్లేజింగ్ (VLT) కంట్రోల్డ్ కర్వ్డ్ గ్లాస్ తో కూడిన కిటికీలు, బాడీ సైడ్ బై-ఫోల్డబుల్ డోర్లు, సౌండ్ & వైబ్రేషన్ డంప్ ఫ్లోటింగ్ ఫ్లోర్, ఎల్ఈడీ బేస్డ్ లైట్స్ ఉంటాయి.

Benares Hindu University : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సహాయం ప్రకటన.. వివరాలిలా..


కొత్త టాయ్ రైళ్లు 1903లో బ్రిటిష్ వారు నిర్మించిన 96.6 కి.మీ నారో గేజ్ (Narrow-Gauge) ట్రాక్‌లపై నడుస్తాయి. కల్కా-సిమ్లాతో పాటు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే (తమిళనాడు), మాథేరన్ హిల్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే (హిమాచల్ ప్రదేశ్) వంటి టాయ్ రైళ్లను భారతీయ రైల్వే వ్యవస్థ నడుపుతోంది. ఈ రైళ్లు నెమ్మదిగా నడుస్తాయి కానీ జర్నీలో మాత్రం అందమైన ప్రకృతి దృశ్యాలు చూపిస్తూ మరువలేని ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.

First published:

Tags: Himachal Pradesh, Indian Railways, Toys, Trains