హోమ్ /వార్తలు /బిజినెస్ /

Maruti Suzuki: కారు కొనాలనుకుంటున్న వారికి మారుతి సుజుకి శుభవార్త.. ఆ మోడళ్లపై రూ.34 వేల వరకు డిస్కౌంట్లు.. వివరాలివే

Maruti Suzuki: కారు కొనాలనుకుంటున్న వారికి మారుతి సుజుకి శుభవార్త.. ఆ మోడళ్లపై రూ.34 వేల వరకు డిస్కౌంట్లు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి (Maruti Suzuki) గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల కోసం తన నెక్సా (Nexa) మోడల్‌ కార్లపై రూ.34,000 వరకు డిస్కౌంట్స్‌ (Discounts) ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తగా కారు (Car) కొనాలనుకునే వారికి మారుతి సుజుకి (Maruti Suzuki) గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల కోసం తన నెక్సా (Nexa) మోడల్‌ కార్లపై రూ.34,000 వరకు డిస్కౌంట్స్‌ (Discounts) ప్రకటించింది. కారు కొనుగోలుదారులు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్‌ రూపంలో భారీగా రూ.34 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే కొత్తగా విడుదల చేసిన బాలెనో, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎంపీవీ మినహా అన్ని నెక్సా మోడల్‌లకు జూన్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని గమనించాలి. ఆఫర్లు ఉన్న ఆ కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ (Maruti Suzuki S-Cross)

ఎస్-క్రాస్ ఒక ఎస్‌యూవీగా పరిచయం అయింది. ఈ మోడల్ సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు ట్రిమ్స్‌లో లభిస్తుంది. బేస్ సిగ్మా వేరియంట్ మినహా అన్ని ట్రిమ్ లెవెల్స్ ఆటో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. ఎస్-క్రాస్ మోడల్‌లో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేట్ ఇంజన్‌ను అందించారు. ఈ యూనిట్ 103 bhp, 138 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్‌లో SHVS మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్‌లో సహాయపడే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, లిథియం-అయాన్ బ్యాటరీ అందించారు. జూన్‌లో ఎస్-క్రాస్‌ని కొనుగోలు చేసే కొనుగోలుదారులు రూ.12,000 క్యాష్‌బ్యాక్, అలాగే రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అదనంగా రూ.5,000 కార్పొరేట్ తగ్గింపు పొందవచ్చు.

Car Airbags: ఎయిర్‌బ్యాగ్స్‌ రూల్స్‌ పరిశీలించండంటూ.. ఆ కార్ల కంపెనీ వినతి.. కారణం ఏంటంటే..

మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz)

మారుతి సుజుక్ సియాజ్ సెడాన్ సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా, ఎస్.డెల్టా అనే ఐదు వేరియంట్‌లలో లభిస్తుంది. జీటా, ఆల్ఫా ట్రిమ్‌లు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను పొందుతాయి. సిగ్మా, ఎస్.డెల్టా ట్రిమ్‌లు మాన్యువల్ మోడ్‌లలో మాత్రమే లభిస్తాయి. దేశంలో సియాజ్ ఎక్స్-షోరూమ్ బేస్ వేరియంట్‌ల ధరలు రూ.8,99,500 ప్రారంభమవుతాయి. ఆటో ట్రాన్స్‌మిషన్‌తో కూడిన టాప్-స్పెక్ ఆల్ఫా వేరియంట్‌ ధర రూ.11,98,500గా ఉంది. వీటిలో డీజిల్ ఇంజన్ అందించక పోవడం గమనార్హం. మారుతి సుజుకి సియాజ్ 1.5-లీటర్ ఇంజన్‌తో 103 bhp, 138 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సియాజ్ అన్ని వేరియంట్‌లపై రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను అందుకోవచ్చు.

Best Car: కియా కారెన్స్‌ vs మారుతి సుజుకి XL6 vs మారుతి సుజుకి ఎర్టిగా.. ఈ మూడు కార్లలో ఏది బెస్ట్..?

మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis)

మారుతి సుజుకి ఇగ్నిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.35 లక్షల నుంచి రూ.7.72 లక్షలుగా ఉంది. ఈ కారు సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ మోడల్ కారు స్టాండర్డ్ వెర్షన్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (81 hp/113 Nm), 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. ఆప్షనల్ వెర్షన్‌లో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పొందవచ్చు. మారుతి సుజుకి ఇగ్నిస్ అన్ని వేరియంట్‌లపై రూ.23,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. అయితే డెల్టా, జీటా, ఆల్ఫా వేరియంట్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ అందుబాటులో ఉండదు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Best cars, CAR, Discounts, MARUTI SUZUKI

ఉత్తమ కథలు