గ్రాట్యుటీపై రూ.20 లక్షల వరకు నో ట్యాక్స్... మీరు ఇలా లెక్కించాలి

మీరు గ్రాట్యుటీ పొందాలంటే కనీసం 4 సంవత్సరాల 10 నెలల 11 రోజులు పనిచేయాలి. అప్పుడే ఐదేళ్ల గ్రాట్యుటీ వస్తుంది. ఒకవేళ 6 సంవత్సరాల 6 నెలలు పనిచేస్తే ఏడేళ్ల గ్రాట్యుటీకి అర్హులు. అదే 6 ఏళ్ల 5 నెలలు పనిచేస్తే ఆరేళ్ల గ్రాట్యుటీ మాత్రమే వస్తుంది.

news18-telugu
Updated: February 7, 2019, 4:56 PM IST
గ్రాట్యుటీపై రూ.20 లక్షల వరకు నో ట్యాక్స్... మీరు ఇలా లెక్కించాలి
గ్రాట్యుటీపై ట్యాక్స్ లిమిట్ రూ.20 లక్షలు... మీరు ఇలా లెక్కించాలి
  • Share this:
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్‌ ప్రసంగంలో గ్రాట్యుటీపై పన్ను మినహాయింపులు రూ.20 లక్షలకు పెంచుతూ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో రూ.10 లక్షల గ్రాట్యుటీ వరకే పన్ను మినహాయింపు ఉండేది. ఆ పరిమితి రూ.20 లక్షలకు పెరిగింది. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటీ? ఎలా లెక్కించాలి? ఎన్నేళ్ల సర్వీసుకు ఎంత వస్తుంది? అన్న అనుమానాలు ఉద్యోగుల్లో ఉన్నాయి. వివరంగా తెలుసుకోండి.

గ్రాట్యుటీ అంటే ఏంటీ?ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం, 1972 ప్రకారం ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. గ్రాట్యుటీ మీ వేతనంలో భాగమే. మీ సంస్థ యజమాని మీ సేవల్ని గుర్తించి ఇచ్చే పారితోషికం. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో గ్రాట్యుటీ కూడా ఉంటుంది. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయంలో గ్రాట్యుటీ చెల్లిస్తుంది ఆ సంస్థ. అయితే ఐదేళ్ల పాటు నిరంతరాయంగా ఓ సంస్థలో పనిచేసినవారికే గ్రాట్యుటీ వర్తిస్తుంది. మీరు గ్రాట్యుటీ పొందాలంటే కనీసం 4 సంవత్సరాల 10 నెలల 11 రోజులు పనిచేయాలి. అప్పుడే ఐదేళ్ల గ్రాట్యుటీ వస్తుంది. ఒకవేళ 6 సంవత్సరాల 6 నెలలు పనిచేస్తే ఏడేళ్ల గ్రాట్యుటీకి అర్హులు. అదే 6 ఏళ్ల 5 నెలలు పనిచేస్తే ఆరేళ్ల గ్రాట్యుటీ మాత్రమే వస్తుంది.

Read this: మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి 5 బెస్ట్ ఆప్షన్స్ ఇవే...

gratuity formula 2019, gratuity budget 2019, gratuity calculator formula 2019, gratuity eligibility 2019, gratuity notification, gratuity rules 2019, gratuity act amendment 2018, gratuity calculation formula, గ్రాట్యుటీ ఫార్ములా 2019, గ్రాట్యుటీ రూల్స్ 2019, గ్రాట్యుటీ చట్టం 2019


గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు?


గ్రాట్యుటీ లెక్కించడానికి ఓ ఫార్ములా ఉంది. సాధారణంగా ఒక నెలలో పనిరోజులు 26 ఉంటాయి. బేసిక్ సాలరీ, డీఏ, కమిషన్ కలిపి గ్రాట్యుటీ లెక్కిస్తారు. ఒక వేళ ఉద్యోగి చనిపోతే నామినీకి గ్రాట్యుటీ చెల్లిస్తారు.గ్రాట్యుటీ లెక్కించే ఫార్ములా: (15 రోజులు x చివరి వేతనం x పనిచేసిన సంవత్సరాలు) / 26

ఉదాహరణకు ఓ వ్యక్తి వేతనం నెలకు రూ.50,000 అనుకుందాం. అతను ఓ సంస్థలో 15 ఏళ్ల 8 నెలలు పనిచేస్తే 16 ఏళ్ల గ్రాట్యుటీకి అర్హత వచ్చినట్టే. ఈ లెక్కన గ్రాట్యుటీ (15 రోజులు x రూ.50,000 x 16 ఏళ్లు)/26 = రూ.4.61 లక్షలు.

Read this: Good News: కేవలం 24 గంటల్లో ఐటీఆర్ రీఫండ్స్

gratuity formula 2019, gratuity budget 2019, gratuity calculator formula 2019, gratuity eligibility 2019, gratuity notification, gratuity rules 2019, gratuity act amendment 2018, gratuity calculation formula, గ్రాట్యుటీ ఫార్ములా 2019, గ్రాట్యుటీ రూల్స్ 2019, గ్రాట్యుటీ చట్టం 2019


గ్రాట్యుటీపై ట్యాక్స్


గ్రాట్యుటీ వేతనంలో భాగం కాబట్టి జీతం ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. అయితే గ్రాట్యుటీకి పన్ను మినహాయింపులు ఉన్నాయి. గతంలో రూ.10 లక్షల గ్రాట్యుటీ వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ మినహాయింపును రూ.20 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.

Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...ఇవి కూడా చదవండి:

మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

SmartSIP: మ్యూచువల్ ఫండ్‌లో కొత్తగా స్మార్ట్‌సిప్... నిజంగా స్మార్టేనా?
First published: February 7, 2019, 4:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading