Good News: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్... ఇ-అసెస్‌మెంట్ సెంటర్ ప్రారంభం

National e-Assessment Centre | ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసుకు సమాధానం ఇవ్వాలంటే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోస్ట్‌లో లెటర్స్ పంపాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: October 7, 2019, 5:41 PM IST
Good News: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్... ఇ-అసెస్‌మెంట్ సెంటర్ ప్రారంభం
Good News: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్... ఇ-అసెస్‌మెంట్ సెంటర్ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 7, 2019, 5:41 PM IST
పన్ను చెల్లింపుదారులకు మరో శుభవార్త. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ అసెస్‌మెంట్ మరింత సులభతరం కానుంది. ఆదాయపు పన్ను శాఖ నేషనల్ ఇ-అసెస్‌మెంట్ సెంటర్ (NeAC) ప్రారంభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన అసెస్‌మెంట్ వ్యవహారాలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఇ-ప్రొసీడింగ్ ద్వారా అసెస్‌మెంట్ సాఫీగా సాగిపోతుందని సీబీడీటీ భావిస్తోంది. కొత్త ఇ-అసెస్‌మెంట్ విధానం చూస్తే పన్ను చెల్లింపుదారుల రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి నోటీసులు రియల్‌టైమ్‌లో వచ్చేస్తాయి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్‌‌ వస్తుంది. డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్-DIN తో ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సెర్చ్ చేసి నోటీసు వివరాలు తెలుసుకోవచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసుకు సమాధానం ఇవ్వాలంటే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. పోస్ట్‌లో లెటర్స్ పంపాల్సిన అవసరం లేదు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లోనే రిప్లై ఇవ్వొచ్చు. మీరు రిప్లై ఇచ్చిన తర్వాత NeAC మీ కేసును అసెసింగ్ ఆఫీసర్‌కు పంపిస్తుంది. అసెస్‌మెంట్ ప్రాసెస్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు కొత్త విధానం ఉపయోగపడుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల్ని కలవాల్సిన అవసరం లేకుండానే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

JIO Phone offer: రూ.1500 విలువైన ఫోన్ రూ.699 ధరకే... 2జీ హ్యాండ్‌సెట్ మార్కెట్‌పై కన్నేసిన జియో

Amazon Sale: అమెజాన్‌లో మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్... ఆఫర్స్ ఇవే
Loading...
SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 296 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు తెలుసుకోండి
First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...