ITR Filing | ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే గడువును పొడిగించింది ఆదాయపు పన్ను శాఖ. 2022 మార్చి 15 వరకు 2021-22 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.
ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయనివారికి గుడ్ న్యూస్. ఆదాయపు పన్ను శాఖ ఐటీ రిటర్న్స్ ఫైల్ (IT Returns Filing) చేసే గడువును పొడిగించింది. 2022 మార్చి 15 వరకు 2021-22 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ (ITR Filing) చేయొచ్చు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే గడువు 2021 డిసెంబర్ 31న ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి గడువు పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది కూడా. కానీ అనూహ్యంగా గడువు ముగిసిన 10 రోజుల తర్వాత ఐటీ రిటర్న్స్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.
పన్ను చెల్లింపుదారులు 2021-22 అసెస్మెంట్ ఇయర్ ఐటీఆర్‌ను 2022 మార్చి 15 వరకు ఫైల్ చేయొచ్చు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడానికి 2022 ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఇక కార్పొరేట్లు రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2022 ఫిబ్రవరి 15 లాస్ట్ డేట్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేకపోయారు. గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుందన్న సంగతి తెలిసిందే.
Reliance Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్... ఇక ప్రతీసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు
On consideration of difficulties reported by taxpayers/stakeholders due to Covid & in e-filing of Audit reports for AY 2021-22 under the IT Act, 1961, CBDT further extends due dates for filing of Audit reports & ITRs for AY 21-22. Circular No. 01/2022 dated 11.01.2022 issued. pic.twitter.com/2Ggata8Bq3
గడువు దాటిన తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తే వార్షికాదాయం రూ.5,00,000 లోపు ఉన్నవారు రూ.1,000 జరిమానా, రూ.5,00,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫైన్ రూ.10,000 ఉండేది. అయితే పన్ను చెల్లించాల్సిన కేటగిరీలో లేనివాళ్లకు ఎలాంటి పెనాల్టీలు ఉండవు. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ గడువు పెంచడం సామాన్యులకు ఊరటే.
Step 1- ముందుగా https://eportal.incometax.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- మీ వివరాలతో లాగిన్ కావాలి.
Step 3- e-file ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
Step 4- File Income Tax Return సెలెక్ట్ చేయాలి.
Step 5- అసెస్మెంట్ ఇయర్ 2021-22 సెలెక్ట్ చేయాలి.
Step 6- ఆ తర్వాత ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- Personal ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 8- వేతనం పొందుతున్న ఉద్యోగులు అయితే ITR-1 సెలెక్ట్ చేయాలి.
Step 9- ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నట్టైతే ITR-4 ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 10- మీ వివరాలన్నీ సరిచూసుకొని, అవసరమైన వివరాలు ఎంటర్ చేసి ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాలి.
Step 11- ఆ తర్వాత ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.