హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Sky: టాటా స్కై యూజర్లకు శుభవార్త... తగ్గనున్న ప్యాక్ ధరలు

Tata Sky: టాటా స్కై యూజర్లకు శుభవార్త... తగ్గనున్న ప్యాక్ ధరలు

Tata Sky: టాటా స్కై యూజర్లకు శుభవార్త... తగ్గనున్న ప్యాక్ ధరలు
(ప్రతీకాత్మక చిత్రం)

Tata Sky: టాటా స్కై యూజర్లకు శుభవార్త... తగ్గనున్న ప్యాక్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Tata Sky | కరోనా వైరస్ సంక్షోభం ప్రభావం డీటీహెచ్ ఇండస్ట్రీపైనా పడింది. అందుకే తమ సబ్‌స్క్రైబర్లు తగ్గకుండా ఉండేందుకు ప్లాన్ ధరల్ని తగ్గించబోతోంది టాటాస్కై.

టాటా స్కై యూజర్లకు శుభవార్త. త్వరలో టీవీ సబ్‌స్క్రిప్షన్ ధరల్ని తగ్గించేందుకు టాటా స్కై ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం టాటా స్కైకి 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారిని కాపాడుకునేందుకు టాటాస్కై సబ్‌స్క్రిప్షన్ ప్యాక్ ధరల్ని తగ్గించబోతోంది. కస్టమర్ల బిహేవియర్ డేటాను విశ్లేషిస్తున్న టాటా స్కై సబ్‌స్క్రిప్షన్ ప్యాక్స్‌ను రివైజ్ చేసే ఆలోచనలో ఉంది. కరోనా వైరస్ సంక్షోభ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారిపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. మొత్తం సబ్‌స్క్రైబర్లలో 70 శాతం మంది తమ సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయడానికి లేదా ఖర్చు తగ్గించుకోవడానికి ప్రయత్నించినట్టు టాటా స్కై పరిశీలనలో తేలింది. దీంతో టాటా స్కై సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నెలవారీ ఖర్చుల్ని హేతుబద్ధం చేసే దిశగా ఆలోచిస్తోంది టాటాస్కై. యూజర్ల బిల్లింగ్ రూ.350 లేదా అంతకన్నా తక్కువ అయ్యేలా ప్యాక్స్‌లో మార్పులు చేయబోతోంది.

టాటాస్కై ఇంటర్నల్ అనలిటిక్స్ ఇంజిన్ అలాంటి యూజర్లను గుర్తించి నెలవారీ ఖర్చుల్ని తగ్గించే ప్యాక్స్‌ను అందించనుంది. యూజర్లు తమ సబ్‌స్క్రిప్షన్స్ క్యాన్సిల్ చేసుకోకుండా కొనసాగేలా కాపాడుకోనుంది. దీన్ని బట్టి ఇప్పటికే ప్యాక్స్ రద్దు చేసుకున్న, తక్కువ ధర ప్యాక్స్ తీసుకున్న యూజర్లను టాటా స్కై సంప్రదించి ప్రత్యామ్నాయ ప్లాన్స్ గురించి వివరించనుంది. మార్చిలో కోవిడ్ 19 విజృంభించిన నాటి నుంచి టాటా స్కై 15 లక్షల మంది యూజర్లను కోల్పోయారని అంచనా. వారిని తిరిగి రప్పించుకోవడం, ఉన్నవారు చేజారకుండా చూసుకోవడం కోసం ప్యాక్స్‌లో మార్పులు చేయనుంది టాటాస్కై. కనీసం నెలవారీ ప్యాక్‌లో రూ.100 వరకు తగ్గొచ్చని అంచనా. డీటీహెచ్ యూజర్ల సంఖ్య తగ్గడానికి మరో కారణం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరుగుతుండటమే.

ఇవి కూడా చదవండి:

Credit Card Loan: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే

COVID-19: ఈ మెడికల్ గ్యాడ్జెట్స్ మీ ఇంట్లో ఉన్నాయా?

Aadhaar: మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చాలా? చేయండి ఇలా

First published:

Tags: DTH, Tata Sky

ఉత్తమ కథలు