టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్. మీరు రూ.4,70,000 పైన విలువైన టాటా టియాగో కారు గెలుచుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా 'టాటా స్కై రీఛార్జ్ కరో కార్ జీతో' కాంటెస్ట్‌లో పాల్గొనడమే. ఇందులో గ్రాండ్ ప్రైజ్ కింద టాటా టియాగో కార్‌ను ఇస్తోంది టాటా స్కై. ఒకరిద్దరికి కాదు... ఏకంగా 30 మందికి టాటా టియాగో కార్లను బహుమతిగా ఇవ్వనుంది టాటా స్కై. ఈ ఆఫర్ 2021 జనవరి 8న ప్రారంభమైంది. 2021 ఫిబ్రవరి 6 వరకు కాంటెస్ట్ కొనసాగుతుంది. టాటా స్కై అకౌంట్‌ను రూ.500 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసి ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలి.
'టాటా స్కై రీఛార్జ్ కరో కార్ జీతో' కాంటెస్ట్‌లో పాల్గొనేముందు సబ్‌స్క్రైబర్లు నియమనిబంధనల గురించి తెలుసుకోవాలి. టాటా స్కై సబ్‌స్క్రైబర్లు ఎవరైనా ఈ కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. వారి అకౌంట్ యాక్టీవ్‌లో ఉండాలి. కొత్తగా టాటా స్కై డీటీహెచ్ తీసుకున్నవారు కూడా ఈ కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. రూ.500 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తేనే కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. రీఛార్జ్ చేసిన తర్వాత మీ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వెంటనే ఓ ప్రశ్న వస్తుంది. ఆప్రశ్నకు సమాధానం చెప్పి కాంటెస్ట్‌లో ఎంటర్ కావాలి. కారు గెలుచుకోవడానికి మీకు ఎక్కువ అవకాశాలు రావాలంటే ఎక్కువ సార్లు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.
Gold: బంగారు నగలు కొంటే పాన్ కార్డ్ ఇవ్వాలా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
SBI: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకున్నవారికి శుభవార్త
Buckle up and get ready to take home a brand new Tata Tiago XE. All you have to do is recharge your Tata Sky account with Rs. 500 or more and answer one simple question after the recharge. T&C Apply@TataMotors#RechargeKaroCarJeeto #Win #TataTiagoXE #RechargeNow #WinBig pic.twitter.com/d1OUU0Xx2g
— Tata Sky (@TataSky) January 8, 2021
తెలుగు రాష్ట్రాల సబ్‌స్క్రైబర్లకు Semi-Annual Telugu Value 1, Semi-Annual Telugu Value HD, Semi-Annual Telugu Super HD, Semi-Annual Telugu Prime on HD Zapper, Semi-Annual Telugu Prime New HDS లాంటి ప్యాక్స్‌కు కాంటెస్ట్ వర్తిస్తుంది. వీటితో పాటు మరిన్ని ప్యాక్స్ కాంటెస్ట్ లిస్ట్‌లో ఉన్నాయి. కాంటెస్ట్‌లో పాల్గొనేవారి వయస్సు 18 ఏళ్ల పైన ఉండాలి. భారతదేశంలో నివసిస్తూ ఉండాలి. టాటా స్కై, టాటా మోటార్స్, టాటా స్కై బిజినెస్ అసోసియేట్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ లాంటి వారికి ఈ కాంటెస్ట్ వర్తించదు.
Sovereign Gold Bond: రేపటి నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ సేల్... బంగారం కొనడానికి ఇది కరెక్ట్ టైమా?
LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిందా? వెంటనే తీసుకోవచ్చు ఇలా
కంప్యూటరైజ్డ్ డ్రా ద్వారా విజేతల్ని ఎంపిక చేస్తుంది టాటా స్కై. సరైన సమాధానాలు చెప్పినవారికే కాంటెస్ట్‌లో ఎంట్రీ లభిస్తుంది. ఈరోజు డ్రాలో ఎంటర్ అయిన వారికి తర్వాతి రోజు డ్రా ఉంటుంది. రోజుకో విజేతను ఎంపిక చేస్తుంది టాటా స్కై. విజేతకు Tata Tiago XE (Petrol) గ్రే కలర్ కార్ లభిస్తుంది. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ధర రూ.4,70,000. మొత్తం 30 కార్లను బహుమతిగా ఇవ్వనుంది టాటా స్కై. ఒకరు ఒక కారు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.tatasky.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Automobiles, CAR, Cars, Tata Group, Tata Sky