సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటున్నారా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో సేవింగ్స్ చేస్తున్నారా? ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో నెలనెలా డబ్బులు జమ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. సాధారణంగా ఈ స్కీమ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయకపోతే అకౌంట్ ఇనాక్టీవ్‌గా మారుతుంది. ఆ తర్వాత అకౌంట్ కొనసాగించాలంటే రివైవల్ ఫీజ్, పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం ప్రకటించింది. ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా పాలసీలపై ఇచ్చిన లోన్ల ఇన్‌స్టాల్‌మెంట్లపై మారటోరియం ప్రకటించాయి. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు డిపాజిట్ చేయలేని వారికి ఊరటనిచ్చింది. వారికి ఎలాంటి జరిమానా, రివైవల్ ఫీజు ఉండదని ప్రకటించింది.
2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే మార్చి 31 నాటికి ఈ స్కీమ్స్‌లో డబ్బులు జమ చేయకపోతే అకౌంట్లు ఇనాక్టీవ్ అవుతాయి. ప్రతీ సంవత్సరం ఇదే వర్తిస్తుంది. కానీ ఈసారి లాక్డౌన్ కారణంగా గడువును 2020 జూన్ 30 వరకు పొడిగించింది. అంటే సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి సేవింగ్స్ స్కీమ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు డబ్బులు జమచేయనట్టైతే మీకు జూన్ 30 వరకు అవకాశముంది. అప్పట్లోగా మీరు కనీసం రూ.500 జమ చేస్తే మీకు జరిమానా, రివైవల్ ఫీజులు ఉండవు. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయకపోతే రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Savings Account: ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్‌తో ఎక్కువ లాభం... తెలుసుకోండి
EPF: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల వరకు ఇన్స్యూరెన్స్
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, India post, Lockdown, Money, Money making, Personal Finance, PPF, Save Money, Sukanya samriddhi yojana, TAX SAVING