హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Good News: ఎస్‌బీఐలో లోన్ తీసుకున్న కస్టమర్లకు తగ్గనున్న ఈఎంఐ భారం

SBI Good News: ఎస్‌బీఐలో లోన్ తీసుకున్న కస్టమర్లకు తగ్గనున్న ఈఎంఐ భారం

SBI Good News: ఎస్‌బీఐలో లోన్ తీసుకున్న కస్టమర్లకు తగ్గనున్న ఈఎంఐ భారం
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Good News: ఎస్‌బీఐలో లోన్ తీసుకున్న కస్టమర్లకు తగ్గనున్న ఈఎంఐ భారం (ప్రతీకాత్మక చిత్రం)

SBI Interest Rate | హోమ్ లోన్ కస్టమర్లకు 30 ఏళ్ల లోన్‌పైన రూ.1,00,000 పై రూ.24 చొప్పున ఈఎంఐ తగ్గుతుంది.

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకున్నారా? పర్సనల్ లోన్ తీసుకొని ఈఎంఐ చెల్లిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను 0.35% తగ్గించింది. దీంతో ఈఎంఐలు దిగిరానున్నాయి. ఎస్‌బీఐలో హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లాంటి రుణాలు తీసుకున్నవారందరికీ ఇది వర్తిస్తుంది. అన్ని కాలవ్యవధుల రుణాలకు ఇది వర్తించనుంది. కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఏడాది ఎంసీఎల్ఆర్ 7.75 శాతం నుంచి 7.40 శాతానికి దిగిరానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ వడ్డీని తగ్గించడం వరుసగా ఇది 11వ సారి. కొత్త వడ్డీ రేట్లు 2020 ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తాయి. హోమ్ లోన్ కస్టమర్లకు 30 ఏళ్ల లోన్‌పైన రూ.1,00,000 పై రూ.24 చొప్పున ఈఎంఐ తగ్గుతుంది. అయితే ఎంసీఎల్ఆర్‌తో లింక్ చేసిన లోన్లు తీసుకున్న రుణగ్రహీతలకే ఇది వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి:

EMI Moratorium: హోమ్ లోన్ మారటోరియంతో రూ.2.34 లక్షల నష్టం... ఎందుకంటే

Moratorium: మారటోరియంపై బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ఆర్‌బీఐ

SBI: మారటోరియం ఎంచుకునేవారికి ఎస్‌బీఐ హెచ్చరిక

First published:

Tags: Bank, Bank loans, Banking, Home loan, Housing Loans, Personal Loan, Rbi, Repo rate, Reserve Bank of India, Sbi, State bank of india

ఉత్తమ కథలు