హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉందా? రూ.1,00,000 వరకు ఈ బెనిఫిట్ పొందండి

SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉందా? రూ.1,00,000 వరకు ఈ బెనిఫిట్ పొందండి

SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉందా? రూ.1,00,000 వరకు ఈ బెనిఫిట్ పొందండి
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉందా? రూ.1,00,000 వరకు ఈ బెనిఫిట్ పొందండి (ప్రతీకాత్మక చిత్రం)

SBI Debit Card | ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉన్న కస్టమర్లకు రూ.1,00,000 వరకు లోన్ పొందే అవకాశం కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. ఎలా పొందాలో తెలుసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు గుడ్ న్యూస్. మీ డెబిట్ కార్డుపై మీరు లోన్ తీసుకోవచ్చు. ఈఎంఐ కూడా చెల్లించొచ్చు. అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా ఏవైనా వస్తువులు కొనడానికి బిల్లులు చెల్లించడానికి క్రెడిట్ కార్డులు ఉపయోగించడం మామూలే. క్రెడిట్ కార్డులో ఎంత లిమిట్ ఉంటే అంతవరకు వాడుకొని 15 రోజుల నుంచి 45 రోజుల మధ్య బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. లేదా ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇప్పుడు డెబిట్ కార్డులో కూడా అలాంటి సేవల్ని అందిస్తున్నాయి బ్యాంకులు. ఈ ఫెస్టివల్ సీజన్‌లో షాపింగ్ చేయాలనుకునేవారికి డెబిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తోంది. మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందన్న టెన్షన్ లేకుండా మీకు అవసరమైన వస్తువుల్ని కొనొచ్చు. ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ మాత్రమే కాదు... ఆఫ్‌లైన్‌లో కూడా అంటే ఎక్కడైనా స్టోర్లలో కూడా మీరు షాపింగ్ చేసి మీ పేమెంట్‌ను ఈఎంఐగా మార్చేయొచ్చు.

Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు

Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ బెనిఫిట్స్ చూస్తే మీరు రూ.1,00,000 వరకు లోన్ పొందొచ్చు. అంటే మీరు మీ డెబిట్ కార్డుతో కనీసం రూ.8000 నుంచి గరిష్టంగా రూ.1,00,000 వరకు షాపింగ్ చేయొచ్చు. ఆ మొత్తాన్ని 6, 9, 12, 18 నెలలు ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఈ ప్రాసెస్‌కు ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండదు. వెంటనే లోన్ మంజూరవుతుంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ + 7.50% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.10% ఉంది కాబట్టి దీనికి 7.50% వడ్డీ కలిపితే మొత్తం 15.60% వడ్డీ అవుతుంది. అంటే మీరు డెబిట్ కార్డుతో షాపింగ్ చేసి ఈఎంఐలుగా మారిస్తే ఏడాదికి 15.60% వడ్డీ చెల్లించాలి. అయితే చాలావరకు వస్తువులు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో అందిస్తున్నాయి ప్రముఖ బ్రాండ్లు. కాబట్టి నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనొచ్చు. డెబిట్ కార్డ్ ఈఎంఐకి జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. రూ.25,000 వరకు ప్రీ-పేమెంట్ పెనాల్టీ ఉండదు. అంతకన్నా ఎక్కువ అయితే రూ.2500 లేదా లోన్ మొత్తంలో 3 శాతం పెనాల్టీ చెల్లించాలి.

SBI Yono app: ఎస్‌బీఐ యోనో యాప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక సులువుగా బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలా

JioPostpaid Plus: ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నుంచి జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌కి మారితే లాభాలివే

మీరు డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే మీ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌ను బ్లాక్ చేయదు బ్యాంకు. ప్రతీ నెల మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఈఎంఐ డిడక్ట్ అవుతుంది. డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్‌ను ఒక కస్టమర్ మూడుసార్లు మాత్రమే పొందొచ్చు. మీకు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికి SMS DCEMI అని టైప్ చేసి 567676 నెంబర్‌కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ నుంచి ఎస్ఎంఎస్ పంపాలి. ఈ సర్వీస్ ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందిస్తోంది ఎస్‌బీఐ. కాబట్టి కస్టమర్లు ముందే ఎలిజిబిలిటీ తెలుసుకొని షాపింగ్ ప్లాన్ చేసుకోవాలి. మీకు డెబిట్ కార్డ్ ఈఎంఐ వర్తిస్తే మీరు షాపింగ్ చేసిన స్టోర్‌లో ఎస్‌బీఐ డెబిట్ కార్డును పీఓఎస్ మెషీన్‌లో స్వైప్ చేయండి. అందులో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోండి. పిన్ ఎంటర్ చేయండి. పేమెంట్ పూర్తైన తర్వాత స్లిప్ తీసుకోండి. ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ సెక్షన్‌లో డెబిట్ కార్డ్ ఈఎంఐ సెలెక్ట్ చేసి పేమెంట్ చేయండి.

First published:

Tags: Bank, Bank account, Bank loans, Banking, Personal Loan, Sbi, State bank of india

ఉత్తమ కథలు