స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)... బ్యాంకింగ్ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ. దేశంలోని గ్రామగ్రామాలకు విస్తరించిన బ్యాంకింగ్ నెట్వర్క్ ఇది. దేశవ్యాప్తంగా 45 కోట్లకు పైగా కస్టమర్లు ఉంటారని అంచనా. కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్ని మరింత దగ్గర చేసేందుకు ఎస్బీఐ మరిన్ని చర్యలు తీసుకోబోతోంది. ఎస్బీఐ త్వరలో వాట్సప్ (WhatsApp) ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందించబోతోంది. ఎస్బీఐ వాట్సప్ బ్యాంకింగ్ (SBI WhatsApp Banking) త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ విషయాన్ని ఎస్బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా తెలిపారు. అదే జరిగితే ఎస్బీఐ కస్టమర్లు చాలావరకు బ్యాంకు సేవల్ని వాట్సప్ ద్వారా పొందొచ్చు.
ఇప్పటికే పలు బ్యాంకులు వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు వాట్సప్ ద్వారా బ్యాకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులన్నీ దాదాపుగా వాట్సప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఈ విషయంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ కాస్త వెనుకబడింది. మొత్తానికి ఎస్బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సర్వీసులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.
LIC Policy: ప్రతీ ఏటా డబ్బులు వచ్చే ఎల్ఐసీ పాలసీ ఇది... రోజూ రూ.45 చెల్లిస్తే చాలు
కార్పొరేట్ క్లైంట్లు, అగ్రిగేటర్లకు ఏపీఐ లాంఛ్ చేయబోతున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఏపీఐ బ్యాంకింగ్ సిస్టమ్ లాంఛైతే బ్యాంకుకు, క్లైంట్ సర్వర్లకు మధ్య కమ్యూనికేషన్ సులువవుతుంది. రెండు వ్యవస్థల మధ్య డేటా ట్రాన్స్ఫర్ ఈజీగా సాగుతుంది. కస్టమర్లకు ఇబ్బందులు లేని, సురక్షితమైన సేవలు లభిస్తాయి. పలు బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేందుకు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సప్ సేవల్ని ఉపయోగించుకోనుంది ఎస్బీఐ. అయితే ఎస్బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న విషయం ప్రస్తుతానికి తెలియదు.
LIC Policy: రోజూ రూ.29 జమ చేయండి చాలు... రూ.4 లక్షలు మీ సొంతం... మహిళలకు మాత్రమే
ఇప్పటికే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు వాట్సప్ ద్వారా పలు సేవల్ని అందిస్తోంది. ఇందుకోసం ఎస్బీఐ కార్డ్ వాట్సప్ కనెక్ట్ సర్వీస్‌ను గతంలోనే ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లు తమ అకౌంట్ వివరాలు, రివార్డ్ పాయింట్స్, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ లాంటి సేవలన్నీ పొందొచ్చు. ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు ఈ సర్వీస్ ఉపయోగించుకోవడానికి ముందుగానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 08080945040 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. రిజిస్టర్ చేసిన తర్వాత వాట్సప్‌లో 9004022022 నెంబర్‌కు OPTIN అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. ఆ తర్వాత క్రెడిట్ కార్డుకు సంబంధించిన సేవల్ని వాట్సప్‌లో పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Personal Finance, Sbi, State bank of india, Whatsapp