హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI WE CARE FD: సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ గడువు పెంపు.. 0.30% అదనపు రాబడి..

SBI WE CARE FD: సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ గడువు పెంపు.. 0.30% అదనపు రాబడి..

SBI WE CARE FD: సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ గడువు పెంపు.. 0.30% అదనపు రాబడి..

SBI WE CARE FD: సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ గడువు పెంపు.. 0.30% అదనపు రాబడి..

SBI WE CARE FD: సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక రాబడిని అందించే ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువును బ్యాంకు పొడిగించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక రాబడిని అందించే ఎస్‌బీఐ వీ కేర్‌ (SBI WE CARE) ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువును బ్యాంకు పొడిగించింది. సీనియర్‌ సిటిజన్ల సేవింగ్స్‌కు అధిక రాబడిని అందించే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను ఎస్‌బీఐ లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను పొడిగించడంతో ఎక్కువ మంది లబ్ధిదారులు ప్రయోజనాలు పొందే అవకాశం లభించింది. ఈ స్కీమ్‌ వడ్డీలు, ప్రయోజనాలు చెక్ చేద్దాం.

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. WE CARE FD స్కీమ్ గడువు తేదీని 2023 మార్చి 31 వరకు పెంచారు. ఎస్‌బీఐ ఈ పథకాన్ని ప్రత్యేకంగా సీనియర్‌ సిటిజన్ల కోసం లాంచ్‌ చేసింది. దీని ద్వారా సీనియర్‌ సిటిజన్లు 0.30 శాతం అదనపు రాబడి పొందవచ్చు. ఎఫ్‌డీపై వర్తించే వడ్డీ రేటుపై అదనంగా రాబడిని అందిస్తోంది. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధికి చేసిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై.. సీనియర్ సిటిజన్లు 0.80 శాతం వరకు ఎక్కువ వడ్డీ పొందవచ్చు.

* 5 సంవత్సరాల డిపాజిట్‌పై 6.45% వడ్డీ

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తుంది. ఉదాహరణకు ఎస్‌బీఐ ప్రస్తుతం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై సంవత్సరానికి 5.65 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇందులో, డిపాజిటర్ సీనియర్ సిటిజన్ అయితే, వారికి 6.15 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.

SBI WE CARE ఫిక్స్‌డ్ డిపాజిట్‌ స్కీమ్‌ తీసుకున్నవారు ఎక్కువ రాబడిని పొందగలుగుతారు. సీనియర్ సిటిజన్లు ఐదేళ్ల కాలానికి చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 6.45 శాతం వార్షిక వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై అంటే రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వర్తిస్తాయి. SBI WE CARE కింద పొందిన అదనపు వడ్డీ ప్రయోజనాన్ని కొత్త ఖాతాలను తెరవడం, డిపాజిట్‌ను రెన్యూవల్‌ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. మెచ్యూరిటీకి ముందే విత్‌డ్రా చేసుకుంటే అదనపు వడ్డీ ప్రయోజనాన్ని కోల్పోతారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్టేట్‌ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Fixed deposits, Personal Finance, Sbi, Senior citizens

ఉత్తమ కథలు