హోమ్ /వార్తలు /బిజినెస్ /

Senior Citizens: వృద్ధులకు వరం... ఆ స్కీమ్‌లో లిమిట్ పెంపు... నెలకు రూ.20,000 పొందే ఛాన్స్

Senior Citizens: వృద్ధులకు వరం... ఆ స్కీమ్‌లో లిమిట్ పెంపు... నెలకు రూ.20,000 పొందే ఛాన్స్

Senior Citizens: వృద్ధులకు వరం... ఆ స్కీమ్‌లో లిమిట్ పెంపు... నెలకు రూ.20,000 పొందే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Senior Citizens: వృద్ధులకు వరం... ఆ స్కీమ్‌లో లిమిట్ పెంపు... నెలకు రూ.20,000 పొందే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Senior Citizens | కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు ఓ వరం ఇచ్చింది. ఓ స్కీమ్‌లో లిమిట్‌ను భారీగా పెంచింది. దీంతో సీనియర్ సిటిజన్లు నెలకు రూ.20,000 వరకు పొందే అవకాశం లభిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో (Senior Citizen Saving Scheme) ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని రెట్టింపు చేసింది. కేంద్ర బడ్జెట్ 2023 సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో (SCSS) రూ.15 లక్షల మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ లిమిట్‌ను రెట్టింపు చేయడంతో రూ.30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. పెరిగిన లిమిట్ 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. అంటే 2023 ఏప్రిల్ 1 సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వృద్ధులకు ఎంతో మేలు చేయనుంది. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసే ప్రతీ నెలా కొంత పెన్షన్ పొందే అవకాశం లభిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వారు ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో ప్రతీ నెలా కొంత ఆదాయన్ని ఇచ్చేందుకు 2004లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌ను ప్రారంభించింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో ప్రస్తుతం ఉన్న లిమిట్ ప్రకారం చూస్తే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేసినవారికి 8 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ లెక్కన ప్రతీ ఏటా రూ.1,20,000 వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లకు రూ.6,00,000 వడ్డీ పొందొచ్చు. అంటే ప్రతీ నెలా అకౌంట్‌లో రూ.10,000 చొప్పున జమ అవుతుంది. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు ఇది పెన్షన్‌లా ఉపయోగపడుతుంది.

New Rules: రేపటి నుంచి ఈ కొత్త రూల్స్ గుర్తుంచుకోండి... చిక్కులు తప్పవు మరి

అయితే పెంచిన లిమిట్ ప్రకారం చూస్తే సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో 2023 ఏప్రిల్ 1 నుంచి రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. 8 శాతం వార్షిక వడ్డీ లెక్కన చూస్తే ప్రతీ ఏటా రూ.2,40,000 వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లకు రూ.12,00,000 వడ్డీ పొందొచ్చు. ప్రతీ నెలా అకౌంట్‌లో రూ.20,000 చొప్పున జమ అవుతుంది. ఐదేళ్ల పాటు ఇలా ప్రతీ నెలా రూ.20,000 చొప్పున పెన్షన్ పొందొచ్చు. గడువు పూర్తైన తర్వాత ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వెనక్కి వస్తాయి.

Monthly Income Scheme: ప్రతీ నెలా ఆదాయం ఇచ్చే స్కీమ్... రేపటి నుంచి డబుల్

సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గరిష్టంగా రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక రూ.50,000 వరకు వడ్డీకి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకంలో వడ్డీ రేటు విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. వడ్డీ రేటు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. ఈ పథకంలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించవచ్చు.

First published:

Tags: Pension Scheme, Personal Finance, Save Money

ఉత్తమ కథలు