హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: స్వయం ఉపాధి పొందుతున్నారా? మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్

EPFO: స్వయం ఉపాధి పొందుతున్నారా? మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్

EPFO: స్వయం ఉపాధి పొందుతున్నారా? మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: స్వయం ఉపాధి పొందుతున్నారా? మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)

EPFO | మీరు స్వయం ఉపాధి పొందుతున్నారా? ఉద్యోగం కాకుండా సొంతగా ఎంప్లాయ్‌మెంట్ పొందుతున్నారా? అయితే మీకు శుభవార్త.

  స్వయం ఉపాధి పొందుతున్నవారికి శుభవార్త. మోదీ ప్రభుత్వం మరో సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌ను స్వయం ఉపాధి పొందుతున్నవారికి కూడా అందించేందుకు కసరత్తు చేస్తోంది. దీని వల్ల ఎలాంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌లో లేని 90% మంది కవర్ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం కనీసం 10 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు మాత్రమే ప్రావిడెంట్ ఫండ్‌లో సబ్‌స్క్రైబ్ చేయడానికి, ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్స్ పొందడానికి అర్హులు. దీని వల్ల డాక్టర్లు, లాయర్లు, ఛార్టెర్డ్ అకౌంటెంట్స్, ఇతర రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఈపీఎఫ్ఓ బెనిఫిట్స్ లభించట్లేదు. అందుకే స్వయం ఉపాధి పొందుతున్న వీరికి కూడా ఈపీఎఫ్ఓ వర్తించేలా ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌ను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

  Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో ఛార్జీలు ఎంత చెల్లించాలో తెలుసా?

  UPI Payment: గూగుల్ పే, ఫోన్‌పే పేమెంట్స్ చేసినవారికి గుడ్ న్యూస్

  గతేడాది లోక్‌సభలో ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్‌కు ఆమోదముద్ర పడ్డ తర్వాత ఈపీఎఫ్ఓ స్కీమ్ విస్తరించే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. 8 రకాల లేబర్ చట్టాలు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టాలన్నీ కలిపి సోషల్ సెక్యూరిటీ కోడ్ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం. దీని వల్ల సోషల్ సెక్యూరిటీ చట్టాలన్నీ ఒకే గొడుగు కిందికి రానున్నాయి. సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకే కాకుండా స్వయం ఉపాధి పొందుతున్నవారికి కూడా ఈపీఎఫ్ఓ వర్తించేలా నిర్ణయం తీసుకుంటే సోషల్ సెక్యూరిటీ కల్పించడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్టవుతుంది. ఇప్పటికే ఈపీఎఫ్ఓలో 6 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌ను విస్తరిస్తే అనేక మంది ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరే అవకాశముంది.

  EMI Moratorium: మారటోరియంతో ఈఎంఐ వాయిదా వేశారా? రీపేమెంట్ లెక్క ఇదే

  UPI: గూగుల్ పే, ఫోన్ పేలో పేమెంట్స్ చేస్తున్నా? ఈ ఫీచర్ గురించి తెలుసుకోండి

  ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ల అకౌంట్‌లోకి ఉద్యోగి జీతం ప్రకారం యజమాని వాటా 12%, ఉద్యోగి వాటా 12% ప్రతీ నెలా జమ అవుతుంది. దీంతోపాటు ఉద్యోగులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ లభిస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు