స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక సేవల్ని ఆన్లైన్లోనే అందిస్తోంది ఎస్బీఐ. ఇప్పుడు మరో సర్వీస్‌ను కూడా ఆన్లైన్లో అందిస్తున్నట్టు ప్రకటించింది. మీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ లాంటి వాటికోసం నామినీ పేరును రిజిస్టర్ చేసేందుకు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే నామినీ పేరు అప్డేట్ చేయొచ్చు. లేదా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా నామినీ పేరు రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పటికే నామినీ పేరు ఇచ్చినట్టైతే మార్చుకోవచ్చు. ఈ సేవల కోసం కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు.
Tax on EPF Interest: మీ జీతం తక్కువా? అయితే ఈపీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ వర్తించదు... ఎలాగో తెలుసుకోండి
Bank of Baroda: విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... మార్చి 1 నుంచి ఈ కొత్త రూల్స్
We have a good news! Now SBI customers can register their nominee by visiting our branch or logging into https://t.co/YMhpMw26SR.#SBI #StateBankOfIndia #OnlineSBI #InternetBanking pic.twitter.com/AMvWhExDre
— State Bank of India (@TheOfficialSBI) February 3, 2021
ఎస్బీఐలో http://onlinesbi.com లేదా నెట్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత Request & Enquiries ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. అందులో Online Nomination ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీకు వేర్వేరు అకౌంట్స్ ఉన్నట్టైతే అకౌంట్ నెంబర్లు డిస్ప్లే అవుతాయి. అందులో మీరు ఏ అకౌంట్‌కు నామినీ పేరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి Continue పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత నామినీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, అకౌంట్ హోల్డర్‌తో ఉన్న బంధుత్వం లాంటి వివరాలను ఎంటర్ చేయాలి. చివరగా Submit పైన క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది. ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Confirm పైన క్లిక్ చేస్తే అకౌంట్‌కు నామినీ పేరు రిజిస్టర్ అవుతుంది.
Ration Card: రేషన్ షాపులో సరుకులు తీసుకునేవారికి అలర్ట్... ఈ విషయాలు గుర్తుంచుకోండి
Gold Price Downfall: రూ.10,000 తగ్గిన బంగారం ధర... ఈ పతనం ఎంతవరకు?
బ్యాంకింగ్ సేవల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం వల్ల కస్టమర్ల సమయం వృథా అవుతోంది. చిన్న పని కోసం బ్యాంకుకు వెళ్లినా గంట సమయం వృథా అవుతోంది. అందుకే చాలావరకు సేవల్ని ఆన్లైన్లో అందిస్తోంది ఎస్బీఐ. కస్టమర్లు ఇంటి దగ్గర్నుంచి స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఆన్లైన్ సేవలు పొందొచ్చు. http://onlinesbi.com వెబ్సైట్ ద్వారా ఈ ఆన్లైన్ సేవలు పొందొచ్చు. దీంతో పాటు ఎస్బీఐ యోనో యాప్‌లో ఆన్లైన్ సేవలు లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Banking, Sbi, State bank of india