SBI Card: ఇక కార్డు స్వైపింగ్ అవసరం లేదు... మొబైల్‌తో బిల్ పేమెంట్ ఈజీ

SBI Card Pay | వీసా కాంటాక్ట్ లెస్ లేదా మాస్టర్‌కార్డ్ కాంటాక్ట్‌లెస్ సాయంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల్లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు. రోజువారీ పేమెంట్స్ కోసం ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

news18-telugu
Updated: October 17, 2019, 6:22 PM IST
SBI Card: ఇక కార్డు స్వైపింగ్ అవసరం లేదు... మొబైల్‌తో బిల్ పేమెంట్ ఈజీ
SBI Card: ఇక కార్డు స్వైపింగ్ అవసరం లేదు... మొబైల్‌తో బిల్ పేమెంట్ ఈజీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 17, 2019, 6:22 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. 'ఎస్‌బీఐ కార్డ్ పే' ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది బ్యాంకు. మీరు షాపింగ్ చేసినప్పుడు ఈ ఫీచర్ ద్వారా కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ ఫోన్‌తో పేమెంట్స్ చేయొచ్చు. సాధారణంగా షాపింగ్ చేసినప్పుడు కార్డును పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్‌లో కార్డు స్వైప్ చేసి పేమెంట్ చేస్తుంటారు. ఇకపై కార్డు అవసరమే లేదు. మీరు కార్డు మర్చిపోయినా సరే... మొబైల్ ఫోన్‌తో పేమెంట్ చేయొచ్చు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్-NFC ఫీచర్ ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్‌లో ఈతరహా పేమెంట్స్ సాధ్యం. పిన్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. హోస్ట్ కార్డ్ ఎమ్యులేషన్-HCE టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్‌తో కార్డ్ పేమెంట్స్ వేగంగా, సులభంగా, సురక్షితంగా జరుగుతాయి. కార్డు స్కిమ్మింగ్, కార్డు మోసాలకు ఈ విధానంతో చెక్ పడినట్టే. అయితే ఒక ట్రాన్సాక్షన్‌పై గరిష్టంగా రూ.2,000 ఒక రోజులో గరిష్టంగా రూ.10,000 వరకు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు.

వీసా కాంటాక్ట్ లెస్ లేదా మాస్టర్‌కార్డ్ కాంటాక్ట్‌లెస్ సాయంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల్లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు. రోజువారీ పేమెంట్స్ కోసం ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 'ఎస్‌బీఐ కార్డ్ పే' ఫీచర్‌ని ఉపయోగించాలంటే లేటెస్ట్ ఎస్‌బీఐ కార్డ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌ను అన్‌లాక్ చేసి NFC ఫీచర్ ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్‌ దగ్గరకు తీసుకెళ్తే చాలు పేమెంట్ పూర్తవుతుంది. ప్రస్తుతం వీసా ప్లాట్‌ఫామ్‌పై ఈ అందుబాటులోకి వచ్చింది. ఏదైనా ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ వర్షన్ 4.4 కన్నా ఎక్కువ ఓఎస్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు. ప్రస్తుతం రిలయెన్స్ డిజిటల్, రిలయెన్స్ ఫ్రెష్, బిగ్ బజార్, కోస్టా కాఫీ, మెక్ డొనాల్డ్స్ లాంటి ప్రముఖ వ్యాపార సంస్థల్లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్-NFC ఫీచర్ ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్‌ ఉన్నాయి.

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 8 ప్రత్యేకతలివే

SBI Card: మీ దగ్గర ఎస్‌బీఐ కార్డు ఉందా? ఇన్స్యూరెన్స్ ఫ్రీ
Loading...
Realme X2 Pro: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ ఎక్స్2 ప్రో రిలీజ్... ప్రత్యేకతలివే
First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...